WOMAN GIVES BIRTH TO DAUGHTER IN KIEV UNDERGROUND METRO STATION DURING RUSSIAN BOMBING IN UKRAINE MKS
ఆటగదరా శివ! -బయట బాంబుల వర్షం.. బంకర్లో పురుడుపోసుకున్న మహిళ: Russia Ukraine war
‘ఇక్కడ చావు-పుట్టుక రెండూ యుద్ధాలే.. ఆ రెండింటి మధ్య జీవితం మరింత పెద్ద యుద్దరంగం..’అంటాడో కవి. జననం.. మరణం.. యుద్ధం.. అన్నీ రక్తంతో నిండుకున్నవే. యుద్ధోన్మాదం మనిషిదే అయినా.. క్లిష్ట సమయాల్లోనూ వెలుగు రేఖలా కొత్త తరాన్ని పుట్టిస్తాడు లయకారుడు. ఉక్రెయిన్ లో భీకర యుద్ధం మధ్యలో బంకర్ లో పురుడుపోసుకున్న ఆ చిన్నారిని అదృష్ట చిహ్నంగా భావిస్తున్నారిప్పుడు. వివరాలివే..
ఉక్రెయిన్ పై రష్యా యుద్దం తీవ్రంగా సాగుతోంది. రోజులు గడుస్తోన్న కొద్దీ రక్తపాతం పెరిగిపోతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ తోపాటు పలు నగరాల్లో రష్యన్ బాంబు దాడులు కొనసాగుతున్నాయి. జనం ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని ఎక్కడికక్కడే బంకర్లలో దాక్కున్నారు. అయితే ఆ చీకటిలో చిన్న వెలుగురేఖ ఉదయించింది..
2/ 10
ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం దాదాపుగా రష్యా బలాగాల చేతిలోకి వెళ్లిపోయింది. నగరం మొత్తం సైనిక దాడులు..బాంబుల మోత, వైమానిక దాడులు మోతెక్కిపోతోంది. దీంతో ఎంతోమంది ప్రజలు మెట్రో అండర్ గ్రౌండ్ లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ తలదాచుకున్నారు. తాజాగా ఓ మహిళ..
3/ 10
యుద్ధ విమానాల సైరన్లతో కీవ్ నగరం చిగురుటాకులా వణికిపోతున్న సమయంలో అడర్ గ్రౌడ్ లో దాక్కున్న ఓ గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి. బయట బాంబుల మొత కొనసాగుతుండగా, 23 ఏళ్ల మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చింది.
4/ 10
యుద్ధం బారి నుంచి ప్రాణాలు దక్కించుకోవటానికి కుటుంబంతోపాటు కీవ్ మెట్రో అండర్ గ్రౌండ్ స్టేషన్ లో తలదాచుకున్న ఆ మహిళ పురిటి నొప్పులతోొ బాధపడగా, మెట్రో స్టేషన్ లోని వైద్య సిబ్బంది, పోలీసులు ఆమెకు సాయం చేశారు.
5/ 10
శుక్రవారం (ఫిబ్రవరి 25,2022) గత రాత్రి 8.30 గంటల సమయంలో అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్ బంకర్ లో తలదాచుకున్న గర్భిణికి వైద్య సిబ్బంది పురుడుపోశారు. యుద్ధ ప్రపంచంలోకి అడుగుపెట్టిన చిన్నారి, ఆమె తల్లి ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.
6/ 10
ఉక్రెయిన్ లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోడానికి ముందు, టెలిగ్రామ్ యాప్‌లో కొందరు ఈ దృశ్యాలను షేర్ చేయడంతో ఫొటోలు వైరలయ్యాయి. భయనక, దుర్భర పరిస్థితుల్లో పుట్టిన ఆశకిరణం మని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
7/ 10
ప్రస్తుతం ఉక్రెయిన్‌లోని మెట్రో స్టేషన్లు, షాపులు, బార్లు, సబ్వే స్టేషన్లును షెల్టర్ హోమ్స్‌గా మరాయి. వేలాది మంది అందులోనే ఆశ్రయం పొందుతున్నారు. బాంబు దాడుల నుంచి రక్షించుకునేందుకు ఇవి ప్రజలకు ఉపయోగపడుతున్నాయి.
8/ 10
ఉక్రెయిన్‌లోని ప్రధాన పట్టణమైన కీవ్‌లో మెట్రోతో పాటు బాంబ్ షెల్టర్, మరో 4500 షెల్టర్ హోమ్స్ ఉన్నాయి. అక్కడే వేల మంది తలదాచుకుంటున్నారు. రష్యా దాడుల వల్ల ఇప్పటికే లక్ష మంది చెల్లాచెదురయ్యారు.
9/ 10
ఉక్రెయిన్ లోని వివిధ ప్రాంతాల నుంచి జనం పెద్ద ఎత్తున దేశం విడిచి పారిపోతదున్నారు. పోలాండ్, మాల్డోవా, రొమేనియా, హంగేరి, స్లోవేకియా దేశాలకు ఉక్రెయిన్ శరణార్థులు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
10/ 10
గురువారం ఒక్క రోజే సుమారు 35వేల మంది పోలాండ్లోకి ప్రవేశించారు. సుమారు 50 లక్షల మంది ఉక్రెనియన్లు విదేశాలకు తరలివెళ్లే అవకాశాలు ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది. రష్యా దాడుల్లో ముగ్గురు చిన్నారులు సహా 198 మంది పౌరులు చనిపోయినట్లు ఉక్రెయిన్ చెబుతోంది.