ఉద్యోగులకు ఉన్నట్టే విమానాలకు కూడా ఓ రిటైర్మెంట్ వయసు ఉంటుంది. అవి కూడా తమ సేవల నుంచి తప్పుకోవాల్సిందే. భారత దేశంలో ఉద్యోగులకు సుమారు 60 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసు అయితే, విమానాలకు మాత్రం 25 ఏళ్లు రిటైర్మెంట్ వయసు. అంటే విమానం తయారైన తర్వాత 25 సంవత్సరాలు సేవలు అందించిన విమానాలు ఇక సెలవు తీసుకోవాల్సిందే. (ప్రతీకాత్మక చిత్రం)
విమానాలు రిటైర్ అయ్యాక వాటిని ఏం చేస్తారు? అదే తెలుసుకుందాం. 25 సంవత్సరాలు పాటు సేవలు అందించిన విమానాలు తమ చివరి ప్రయాణం గ్యారేజీ వైపే చేస్తాయి. దాన్ని స్టోరేజీ డిపార్ట్ మెంట్ అని కూడా అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇలా రిటైర్ అయిన విమానాలు అన్నీ ఇలా స్టోరేజీకి వెళ్లాల్సిందే. అయితే, ప్రపంచంలో ఎక్కువగా ఓ దేశంలో మాత్రం ఇలా విమానాల స్టోరేజీ కేంద్రాలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రపంచవ్యాప్తంగా చాలా ఎయిర్ లైన్స్ సంస్థలు ఉన్నాయి. అవి ఎన్నో ఏళ్ల నుంచి సర్వీసులను అందిస్తున్నాయి. కొత్త విమానాలను కొంటూ పాత విమానాలను ఇలా స్టోరేజీ సెంటర్లకు పంపుతాయి. అలా ఎక్కువ స్టోరేజీ సెంటర్లున్న దేశం అమెరికా. అమెరికాలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో ఇలాంటి కేంద్రాలు ఉన్నాయి. ప్రపంచంలో రిటైరైన చాలా దేశాలు ఇక్కడకు తీసుకొస్తారు.(ప్రతీకాత్మక చిత్రం)
రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా చాలా ఎయిర్ లైన్స్ సంస్థలు సరిగా నడవడం లేదు. కరోనా కారణంగా చాలా దేశాలు ట్రావెల్ బ్యాన్ విధించాయి. ఇలాంటి సందర్భాల్లో కూడా చాలా ఎయిర్ లైన్స్ తమ విమానాలను ఇలాంటి స్టోరేజీ సెంటర్లకు పంపుతాయి. అలా ఎక్కువ కాలం వారి వద్ద పార్కింగ్ చేసినందుకు అద్దె కూడా చెల్లించాల్సి ఉంటుంది. అద్దెలు కూడా భారీగానే ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఇలా రిటైర్మెంట్ సెంటర్లకు వెళ్లిన విమానాలకు మొదట క్లీన్ చేస్తారు. అంటే ఏదో కొంచెం నీళ్లు పోసి కడగడం కాదు. కెమికల్స్ ఉపయోగించి అత్యంత పరిశుభ్రంగా క్లీన్ చేస్తారు. ఎందుకంటే అది ఇనుము కాబట్టి కొంతకాలానికి పాడైపోకుండా ఉండేందుకు ఇలా చేస్తారు. మొత్తం కడిగిన తర్వాత విమానంలో నుంచి ఫ్యూయల్ అంతా తీసేస్తారు. ట్యాంక్ మొత్తం డ్రై అయిపోతుంది. ట్యాంక్ కూడా క్లీన్ చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
फिर क्रेन और मशीनों की मदद से इस बॉडी यानि खांचे को डिस्मेंटल करने का काम शुरू होता है. विमान की पूरी बॉडी. डैने आदि अलग अलग करके क्रश कर दिये जाते हैं और उन्हें गलाया जाता है ताकि रिसायकल करके उनका दोबारा इस्तेमाल किया जा सके. कई बार विमानों की खाली बॉडी को कुछ इच्छुक कंपनियां खरीद भी लेती हैं.
ఆ తర్వాత విమానాల్లో విడిభాగాలు విప్పడం మొదలు పెడతాయి. విమానంలో పార్టులు, మెషిన్, యాక్సెసరీస్, ఇలా ఒక్కొక్కటీ విడదీస్తారు. ఒక విమానంలో చిన్నా పెద్దా అన్నీ కలిపి సుమారు 3.5 లక్షల కంపొనెంట్స్ ఉంటాయి. ఎయిర్ క్రాఫ్ట్ రిపేర్ చేసే సమయంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఇలాంటి విడిభాగాలకు మంచి గిరాకీ కూడా ఉంటుంది. చివరకు ప్లేన్ ప్లాట్ మాత్రమే మిగులుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
మిగిలిన విమానాన్ని క్రేన్ల సాయంతో తీసుకెళ్తారు. వాటిని ముక్కలు ముక్కలు చేస్తారు. చిన్న చిన్న ముక్కలుగా చేసేసి వాటిని ఏకంగా మళ్లీ రీసైకిల్ చేయడానికి ఉపయోగపడేలా క్రష్ చేస్తారు. ఒక్కోసారి కొన్ని కంపెనీలు ఆ ఖాళీ విమానాలను కూడా కొనుక్కుంటాయి. తమకు నచ్చిన విధంగా వాటిని డిజైన్ చేసుకుంటాయి. కొందరు రెస్టారెంట్లు కూడా పెడతారు. (ప్రతీకాత్మక చిత్రం)
స్వీడన్‌కు చెందిన ఒక కంపెనీ ఇలా ఖాళీ విమానాలను కొనుక్కుని వాటిని 25 గదుల హోటల్స్ గా మార్చింది. టర్కీలో పెద్ద హోటల్స్ నెట్ వర్క్‌ను ఏర్పాటు చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఓ భారీ విమానాన్ని ట్రక్ మీద తీసుకుని వెళ్తున్న వీడియో కూడా బాగా సోషల్ మీడియాలో పాపులర్ అయింది. దాన్ని మీరు చూసే ఉంటారు. ఇండియాలో కూడా కొందరు విమానాన్ని కొని తమకు నచ్చినట్టుగా వాడుకుంటారు. మెక్సికోలో ఓ 200 విమానాలతో ఓ లైబ్రరీ కూడా ఏర్పాటు చేశారు. (ప్రతీకాత్మక చిత్రం) (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)