తగినంత శారీరక శ్రమ లేకపోవడం అధిక బరువు(Over weight)కి ప్రధాన కారణంగా వైద్యులు చెబుతుంటారు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలూ బరువు పెరగడానికి కారణమవుతుంటాయి. అదే సమయంలో, బరువు పెరగడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలూ అన్నీ ఇన్నీ కావు. ఒక్కసారి బరువు పెరిగాక, ఆ బరువుని తగ్గించుకోవడానికి పడాల్సిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. (Screen grab from video posted on facebook by nick.craft.18)
బరువు పెరగడం కారణంగా వచ్చే సమస్యల్లో మానసిక సమస్యలు ముఖ్యమైనవి. చాలా మంది డిప్రెషన్లోకి వెళ్లిపోతుంటారు. తోటి వాళ్లతో కలిసి ఉండలేక.. వాళ్లు హేళన చేస్తారనే భయంతో, బాధతో నలుగురిలో కలవలేరు.. అలాంటి వ్యక్తులు మన కళ్ల ముందే చాలా మంది కనిపిస్తారు. (Screen grab from video posted on facebook by nick.craft.18)