ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తిగా అమెరికా అధ్యక్షుణ్ని చెబుతారు. ఎందుకంటే... అమెరికా ప్రపంచ దేశాల్ని శాసిస్తూ ఉంటుంది. అధ్యక్షుడు తీసుకునే ప్రతీ నిర్ణయం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంటుంది. అలాంటిది ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్‌కి ఫేర్వెల్ చెబుతూ ప్రజలు... అత్యంత ఘోరంగా అవమానిస్తున్నారు. ఇదివరకు ఏ అమెరికా అధ్యక్షుడికీ ఇంత ఘోరమైన సెండాఫ్ ప్రజలు ఇవ్వలేదు.
ఈ ఎన్నికల్లో ట్రంప్‌ని ఓడించాలని పట్టుదలతో ఎదురుచూసిన ప్రజలు... పోలింగ్ నాడు కసి తీర్చుకున్నారు. జో బిడెన్‌కు చరిత్రాత్మక విజయాన్ని అందించారు. ఇదివరకు రిపబ్లికన్ల అడ్డాలుగా ఉన్న రాష్ట్రాల్లోనూ... డెమొక్రటిక్ నేత జో బిడెన్ ఈసారి విజయం సాధించారు. ట్రంప్‌పై ప్రజల్లో ఎంత అసహనం ఉందో దీన్ని బట్టీ అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు... తాజాగా ట్రంప్ కాన్వాయ్ వెళ్తుండగా... రోడ్డు పక్కన నిల్చున్న ప్రజలు.. ఆయనకు సెటైరికల్ సెల్యూట్ చెబుతూ... మిడిల్ ఫింగర్ చూపించడం తీవ్ర కలకలం రేపింది.
శనివారం సాయంత్రం బిడెన్ తన విజయ ప్రకటన చేశారు. దేశ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. దేశాన్ని రెండుగా విభజించే టైపు తాను కాదన్నారు. తద్వారా జాతి వ్యతిరేక ఆందోళనలు తన పాలనలో ఉండబోవని చెప్పినట్లైంది. ఈ ఎన్నికల్లో జో బిడెన్ 290 ఎలక్టొరల్ ఓట్లు సాధించారు. ఫలితంగా ట్రంప్ తీవ్ర అవమానంతో పదవి కోల్పోవాల్సి వస్తోంది.