Bomb Cyclone : అమెరికాలో వద్దంటే మంచు కురుస్తోంది. రాత్రీ పగలూ తేడా లేకుండా కుండపోతను మించి కురుస్తోంది. గుట్టలుగా పేరుకుపోతోంది. వాహనాలన్నీ మంచులో కూరుకుపోతున్నాయి. ఇళ్లపైనే కాదు.. ముందు, చుట్టుపక్కల అంతా మంచే. ఏది రోడ్డో, ఏది గార్డెనో తెలియట్లేదు. మొత్తం శ్వేతమయం అయిపోయింది. (image credit - twitter - RajuPallepaga)
ఎక్కువ మరణాలు సంభవిస్తున్న న్యూయార్క్ లోని బఫెలో (Buffalo) మంగళవారం మరింత మంచు కురవడంతో... ఆ ప్రాంతం పూర్తిగా మంచులో ఉంది. 40 ఏళ్లలో ఎప్పుడూ లేనంత మంచు అక్కడ కురుస్తోంది. రోడ్డు ప్రమాదాలు, కరెంటు కోతలూ ఉన్నాయి. రంగంలోకి దిగిన మిలిటరీ పోలీసులు.. డ్రైవింగ్‌ను నిషేధించారు. (image credit - twitter - RajuPallepaga)
ఈ మంచు తుపాను వల్ల ఎంత మంది చనిపోయారనేది కచ్చితంగా తెలియట్లేదు. 70 మందికి పైగా చనిపోయి ఉండొచ్చనే అంచనా ఉంది. చాలా చోట్ల వాహనాల టైర్లు స్కిడ్ అవుతూ.. ప్రమాదాలు జరుగుతుంటే.. మరణాల సంఖ్య పెరుగుతోంది. అలాగే ముసలి వారు కూడా చని వల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడి చనిపోతున్నారు. (image credit - twitter - @mkrms_jang)
ప్రస్తుతం అమెరికాలోని పశ్చిమ, ఉత్తర రాష్ట్రాల్లో రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రోడ్లపై మంచు ఉండటం వల్ల వాహనాలు ముందుకు వెళ్లట్లేదు. చాలా చోట్ల మంచులో కూరుకుపోతున్నాయి. సరుకుల్ని తీసుకెళ్లే ట్రక్కులు, అంబులెన్సులు కూడా ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది. (image credit - twitter - @NgomaTshiamo)
బాంబ్ సైక్లోన్‌గా పిలిచే ఈ తుపాను వల్ల అమెరికాలోని 60 శాతం మందిపై ప్రభావం కనిపిస్తోంది. అంటే 24 కోట్ల మంది ఇబ్బంది పడుతున్నారు. విమాన సర్వీసులు, రైళ్లు, వాహన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రధాన రహదారులన్నీ మూసేశారు. చాలా రాష్ట్రాల్లో కరెంటు సప్లై సరిగా లేదు. (image credit - twitter - @NgomaTshiamo)