COVID test: ప్రస్తుతం మానవాళికి అతి పెద్ద శత్రువుగా కరోనా మారింది. ఆ వైరస్‌ని ఎదుర్కోవడమే ప్రపంచ దేశాల టార్గెట్ అయ్యింది. ఈ క్రమంలో ఎన్నో వందల పరిశోధనలు జరుగుతున్నాయి. కరోనా టెస్టుల ఫలితాలు వెంటనే వస్తే... ఆ వ్యక్తికి కరోనా వుంది అని తేలితే... వెంటనే ఐసోలేట్ చెయ్యవచ్చు. తద్వారా మరింత మందికి వైరస్ సోకకుండా చెయ్యవచ్చు. ఐతే... టెస్టు ఫలితాలు ఆలస్యంగా వస్తే... ఒక వేళ ఆ వ్యక్తి పాజిటివ్ అయితే... ఫలితాలు వచ్చేసరికే... ఆ వ్యక్తి ద్వారా మరింత మందికి కరోనా సోకే ఛాన్స్ ఉంటుంది. అందుకే త్వరగా ఫలితం వచ్చే కొత్త ర్యాపిడ్ టెస్ట్ కిట్‌ను బ్రిటన్ పరిశోధకులు తయారుచేశారు. ఇది జస్ట్ 3 నిమిషాల్లోనే అత్యంత కచ్చితమైన ఫలితాన్ని చెబుతోందని చెప్పారు. (image credit - twitter)
బర్మింగ్‌హామ్ యూనివర్శిటీ పరిశోధకులు మూడు రకాలుగా ఈ టెస్ట్ కిట్‌ను సరిపోల్చి చూశారు. ఈ అధ్యయన వివరాల్ని మంగళవారం ప్రచురించారు. పరిశోధనలో తేలిందేంటంటే... RT-PCR టెస్టు, LAMP టెస్టుల లాగానే... RTF-EXPAR టెస్టు కూడా కచ్చితమైన ఫలితాలు ఇస్తోందని చెప్పారు. ప్రస్తుతం కరోనా ఉందో లేదో తేల్చడానికి RT-PCR, LAMP టెస్టులు చేస్తున్నారు. వీటి ద్వారా ఫలితం రావడానికి ఒక రోజు పడుతోంది. (image credit - twitter)
ట్రయల్స్‌లో RTF-EXPAR టెస్టు... 8 నిమిషాల 45 సెకండ్లలో కరోనాను కనిపెట్టింది. LAMP టెస్టు 11 నిమిషాల 15 సెకండ్లు తీసుకుంటోంది. అదే RT-PCR టెస్ట్ అయితే ఫలితం రావడానికి 42 నిమిషాలు పడుతోంది. శాంపిల్‌లో వైరస్ సంఖ్య ఎక్కువగా ఉంటే... అప్పుడు RTF-EXPAR 3 నిమిషాల్లోనే ఫలితం ఇస్తోందని తేల్చారు. పైగా మిగతా రెండింటితో పోల్చితే ఈ కొత్త టెస్టును చెయ్యడం చాలా తేలిక. ఎక్కువ పరికరాలు కూడా అక్కర్లేదు. (image credit - twitter)
RT-PCR టెస్టు లాగే పనిచేసే RTF-EXPAR... పాజిటివ్ ప్రెడిక్టివ్ వ్యాల్యూ 89 శాతంగా, నెగెటివ్ ప్రెడిక్టివ్ వాల్యూ 93 శాతంగా ఉంద అని బర్మింగ్‌హామ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఆండ్ర్యూ బెగ్స్ తెలిపారు. తమ టెస్టు కిట్‌కి పేటెంట్ కోసం యూనివర్శిటీ పరిశోధకులు అప్లై చేశారు. దానికి పేటెంట్ లభించి... ఏదైనా ఫార్మా కంపెనీ... వాణిజ్య స్థాయిలో ఈ టెస్ట్ కిట్లను అభివృద్ధి చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు. (image credit - twitter)
ఈ కొత్త టెస్టు ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. RT-PCR, LAMP టెస్టుల ద్వారా శాంపిల్స్‌లో వైరస్ తాలూకు జన్యు పదార్థం RNA ఉందేమో గమనిస్తారు. RNA ఉంటే పాజిటివ్వే. ఇందుకోసం ల్యాబులో ముందుగా... RNAను DNAగా మార్చుతారు. దీన్నే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటారు. ఆ తర్వాత యాంప్లిఫికేషన్ చేస్తారు. ఇది ఆలస్యమయ్యే ప్రక్రియ. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టుల్లో ఈ 2 ప్రక్రియలూ ఉండవు. బర్మింగ్‌హామ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు... సరికొత్త విధానంలో RNAను DNAగా మార్చడం కనిపెట్టారు. అందువల్ల రివర్స్ ట్రాన్స్స్క్రి్ప్షన్ అయ్యే ఛాన్స్ లేదు. అలాగే యాంప్లిఫికేషన్ కూడా వేగంగా జరుగుతుందీ కొత్త కిట్‌లో. (image credit - NIAID)