Donald Trump: సోషల్ మీడియా సంస్థలపై ట్రంప్ ఆగ్రహం.. సీఈఓలపై దావా వేస్తున్నట్లు ప్రకటన.. ఎందుకంటే..
Donald Trump: సోషల్ మీడియా సంస్థలపై ట్రంప్ ఆగ్రహం.. సీఈఓలపై దావా వేస్తున్నట్లు ప్రకటన.. ఎందుకంటే..
Donald Trump: సోషల్ మీడియాలో తమ ఖాతాలను అన్యాయంగా తొలగించారంటూ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా సంస్థల సీఈఓలపై దావా వేస్తున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తనను అన్యాయంగా మాధ్యమాల నుంచి తొలగించారంటూ ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ సంస్థలతో సహా వాటి సీఈఓలపై న్యాయపోరాటం చేసేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. డోనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఫొటో)
2/ 5
వారిపై దావా వేస్తున్నట్లు ప్రకటించారు. ఫ్లోరిడా లోని యూ.ఎస్ జిల్లా కోర్టులో దావాలు దాఖలు చేసినట్లు బెడ్‌మినిస్టర్‌లో జరిగిన న్యూస్ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
గొంతుక లను వినిపించకుండా చేయడాన్ని, బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడాన్ని ఆపాలన్నదే తమ డిమాండ్ అని పేర్కొన్నారు. ఈ దావాల్లో ముఖ్యప్రతివాది తానేనని పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
కాపిటల్ భవనం మీద దాడికి ఉసిగొల్పారంటూ ఈ ఏడాది జనవరి 6న ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలను ట్విట్టర్, ఫేస్‌బుక్‌లు రద్దు చేశాయి . (image: REUTERS)