ఉల్కలు (comets) అనేవి.. రాళ్ల లాంటివి. భూమికి దగ్గర్లో తరచూ తోకచుక్కలు అంతరిక్షంలో వెళ్తూ ఉంటాయి. వాటి నుంచి వీడిపోయి.. భూ వాతావరణంలో పడే రాళ్లే ఉల్కలు. భూ వాతావరణంలోకి రాగానే ఇవి మండిపోతాయి. అందువల్ల మెరుస్తూ కనిపిస్తాయి. జెమినిడ్స్ (geminids meteor shower) అనే తోకచుక్క నుంచి ఈ ఉల్కలు ఇవాళ్టి నుంచి 17వ తేదీ వరకూ ఆకాశంలో కనిపిస్తూనే ఉంటాయి. వీలైతే చూడండి.
ఈ ఉల్కలను మామూలు కళ్లతోనే చూడొచ్చు. బుధవారం రాత్రి 9 తర్వాత ఈశాన్యం, తూర్పు వైపు ఆకాశంలో కనిపిస్తాయి. రాత్రంతా కనిపిస్తాయి. అర్థరాత్రి నెత్తి మీద కనిపిస్తాయి. తెల్లవారుజామున.. సూర్యుడు రాకముందు.. పడమరవైపు కనిపిస్తాయి. ఈ రాళ్లలో కొన్ని మండేలోపు భూమిపై పడతాయి. అలాంటి సమయంలో భూమికి ఆపద ఉంటుంది. అవి ఇళ్లపై పడే ప్రమాదం ఉంటుంది.
ఇక రెండో విషయం గ్రహశకలం. మన భూమి చుట్టూ తరచూ గ్రహశకలాలు తిరుగుతూనే ఉంటాయి. అప్పుడప్పుడూ ఇవి భూమికి దగ్గరగా వస్తాయి. వీటి వల్ల ఎప్పటికైనా భూమికి ప్రమాదమే అని భావిస్తున్న నాసా.. ఈమధ్యే గ్రహశకలాల్ని పేల్చేసే టెక్నాలజీని విజయవంతంగా అభివృద్ధి చేసింది. ఏదైనా గ్రహశకలం భూమివైపు వస్తూ ఉంటే.. అంతరిక్షంలోనే దాన్ని పేల్చేసేలా ప్లాన్ ఉంది.
ఈ నెల 15న గ్రహశకలం 2015 RN35 భూమికి దగ్గరగా వస్తుంది. దగ్గరగా వచ్చినప్పుడు అది 6.86 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందువల్ల మన భూమికి ఏ ప్రమాదమూ లేనట్లే. కాకపోతే.. అది వచ్చే దారిలో మరో రాయి ఏదైనా దాన్ని ఢీకొంటే.. అప్పుడు గ్రహశకలం రూట్ మారి.. భూమివైపు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే నాసా దీన్ని గమనిస్తోంది.