ప్రధాని పదవికి మహీంద రాజపక్స రాజీనామా చేసిన తర్వాత హింసాత్మక దాడులతో అల్లకల్లోలంగా మారిన శ్రీలంక బుధవారం నాటికి కొద్దిగా శాంతించింది. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులతో శ్రీలంక సైన్యం రంగంలోకి దిగిన తర్వత పరిస్థితులు కాస్త చక్కబడ్డాయి. ఇవాళ భారీ నిరసనలు, హింసాకాండలేవీ చోటుచేసుకోలేదు. కొలంబో సహా చాలా నగరాల్లో యుద్ధ ట్యాంకులు, ఆయుధాలతో సైన్యం పహారా కాస్తున్న దృశ్యాలు కనిపించాయి.
రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో సైనిక తిరుగుబాటు తలెత్తనుందనే వార్తలు సంచలనం రేపాయి. అయితే సైనిక తిరుగుబాటు ప్రసక్తే లేదని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి కమల్ గుణరత్నే స్పష్టం చేశారు. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామని ఎట్టి పరిస్థితుల్లోనూ బావించవద్దని చెప్పారు. సైన్యానికి అటువంటి ఉద్దేశాలేవీ లేవన్నారు.
రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో సైనిక తిరుగుబాటు తలెత్తనుందనే వార్తలు సంచలనం రేపాయి. అయితే సైనిక తిరుగుబాటు ప్రసక్తే లేదని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి కమల్ గుణరత్నే స్పష్టం చేశారు. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామని ఎట్టి పరిస్థితుల్లోనూ బావించవద్దని చెప్పారు. సైన్యానికి అటువంటి ఉద్దేశాలేవీ లేవన్నారు.
శ్రీలంకలో ప్రజల నిరసనలు వెల్లువెత్తుతుండటంతో గొటబయ రాజపక్స ఇటీవల కట్టుదిట్టమైన భద్రత నడుమ అధికారిక నివాసానికి పరిమితమయ్యారు. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి ఐక్య ప్రభుత్వాన్ని ఆయన ఏర్పాటు చేయలేకపోతున్నారు. ప్రజా సమూహాల ముసుగులో హింసను రెచ్చగొడుతున్నారని, సైనిక పాలనను ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారని రాజపక్సపై విపక్షాలు మండిపడుతున్నాయి.
శ్రీలంకలో సైనిక పాలన రాబోతోందని విపక్షాలతోపాటు సాధారణ జనం, నెటిజన్లు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా సైన్యాన్ని మోహరించడం రాజకీయ అధికారాన్ని సైన్యం కైవసం చేసుకోవడానికి మొదటి అడుగు అని చెప్తున్నారు. శ్రీలంకలో సుదీర్ఘ కాలం అంతర్యుద్ధాలు జరిగాయి, శక్తిమంతమైన సాయుద దళాలు ఉన్నాయి, అయినప్పటికీ ఈ దేశంలో సైనిక పాలన రాలేదు. అయితే 1962లో సైనిక తిరుగుబాటుకు ప్రయత్నం జరిగింది. కానీ కనీసం ఒక తూటా అయినా పేలకుండానే ఇది ముగిసింది.
సంక్షోభ శ్రీలంకకు భారత్ నుంచి బలగాలను పంపిస్తున్నట్లు వస్తున్న వార్తలపై విదేశాంగ శాఖ స్పందించింది. శ్రీలంకకు ఇండియా పూర్తిగా మద్దతు ఇస్తుందని, ఆ దేశ ప్రజాస్వామ్యానికి, స్థిరత్వానికి, ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వనున్నట్లు కొలంబోలోని భారత హై కమిషన్ వెల్లడించింది. మాజీ ప్రధాని మహింద రాజపక్స, ఆయన కుటుంబసభ్యులు ఇండియాకు పారిపోయినట్లు వస్తున్న ప్రచారాన్ని కూడా ఇండియన్ మై కమిషన్ కొట్టిపారేసింది.
సోమవారం రాజీనామా చేసిన తర్వాత రాజపక్స నేవీ బేస్ కు వెళ్లి తలదాచుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆయన అక్కడ లేరని తర్వాత వెల్లడైంది. ఎక్కడికి వెళ్లారో ఇంకా తెలిరాలేదు. ఊహాజనిత నివేదికలపై కొన్ని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, అలాంటి రిపోర్ట్‌లను భారత ప్రభుత్వం ఆమోదించడం లేదని హై కమిషన్ తన ట్విట్టర్లో తెలిపింది.