ఎయిర్ పోర్ట్‌లోనే అడవి..40 మీటర్ల ఎత్తైన జలపాతం..ఈ అద్బుతం..ఎక్కడంటే!

సింగపూర్‌లో..చెంగి ఎయిర్ పోర్ట్‌..అద్బుతాలకు నెలవుగా మారింది. ఈ ఎయిర్ పోర్ట్‌లో నాలుగు అంతస్థుల్లో వివిధ రకాల జాతులకు చెందిన మొక్కల్నీ పెంచుతున్నారు. దీంతో ఎయిర్ పోర్ట్‌..ఓ అడవిలో ఉన్నట్లుగా ఉండి..ప్రయాణికులకు ఓ అద్బుత అనుభూతిని ఇస్తోంది. ఎయిర్ పోర్ట్‌కు ఇంకో మణిహారం ఎంటంటే.. 40 మీటర్ల ఎత్తులో నిర్మించిన జలపాతం..ఈ నిర్మాణ: పోర్ట్‌కే తనమానికంగా మారి.. చూపరులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. అయితే జలపాతం పూర్తిగా వర్షపు నీటిని ఆధారంగా చేసుకొని ప్రవహిస్తుంది. అదే దీని ప్రత్యేకతగా చెబుతున్నారు.