అంతరిక్షం, చంద్రమండలం, అంగారక గ్రహాలపై మనిషి ఆవాసం ఏర్పాటు చేసుకునేందుకు ఇప్పటికే అనేక అన్వేషణలు జరుగుతున్నాయి. అక్కడ సంగతి పక్కన పెడితే భూమి మీద ఎలాంటి అద్భుతమైన నగరాలు నిర్మితమవుతాయనే విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే ప్రపంచంలోని చాలా దేశాలు భవిష్యత్ నగరాలను నిర్మించే పనిలో పడ్డాయి.ఆ నగరాల నిర్మాణాలు, వాస్తు, ప్రజల అవసరాలు వంటి అంశాలు వేరే లెవెల్లో ఉంటున్నాయి. వాటి గురించి తెలుసుకొని జనం ఆశ్చర్యపోతున్నారు. వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే అమెరికా, మెక్సికో, సౌదీ అరేబియా, చైనా, దక్షిణ కొరియా, భారత్ వంటి దేశాలు ముందు వరసలో నిలిచాయి.(Photo courtesy:cityoftelosa website)
యూఎస్‌లోని టెల్సా నగరం అరబ్ భర్త మార్క్ లోరే ఆలోచనలతో పుట్టింది. ఈ టౌన్ నిర్మాణ లక్ష్యం ఫ్యూచర్లో పట్టణంలో ఉండే ఇళ్లు అత్యాధునిక, మెరుగైన విధంగా డిజైన్ చేయడం. అయితే ఈ ప్రాజెక్ట్ 2050 నాటికి పూర్తి చేయాలని ఉద్దేశించబడింది. అయితే తమాషా ఏమిటంటే దాని ఖచ్చితమైన స్థితి ఇంకా నిర్ణయించబడలేదు. ఇది పునరుత్పాదక శక్తి, హరిత ప్రాంతం, నీటి సమర్ధవంతమైన వినియోగం, పునర్వినియోగం వంటి భవిష్యత్తు లక్షణాలపై ఆధారపడి ఉంది. ఇది పర్యావరణ, ఆర్థిక దృక్కోణం నుండి ప్రతి తరగతికి నివాసయోగ్యంగా పని చేస్తుంది.(Photo courtesy:ityoftelosa website)
ఇటలీకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ స్టెఫానో బోయరీ 2019లో మెక్సికోలోని కాంకున్ సమీపంలో స్మార్ట్ సిటీని రూపొందించారు. ఇందులో ప్రజలు ప్రకృతితో విడదీయలేని బంధాన్ని కలిగి ఉంటారు. అందుకే దీనికి స్మార్ట్ ఫారెస్ట్ సిటీ అని పేరు పెట్టారు. ఇందులో 7.5 మిలియన్ చెట్ల మొక్కలు ఉంటాయి. ఇందులో ఆ ప్రాంతపు మాయా సంస్కృతి వారసత్వం, సహజ సంబంధం కనిపిస్తుంది.(Photo courtesy: Stefano Boeri the big picutre)
సౌదీ అరేబియా లాంటి ఎడారి దేశంలో అద్బుతమైన నగరాన్ని ఊహించడం చాలా కష్టం. కానీ ఇక్కడ చాలా విలాసవంతమైన సౌకర్యాలతో ఒక నగరం అభివృద్ధి జరుగుతోంది. ఇందుకోసం సౌదీ అరేబియా ప్రభుత్వం 100 నుండి 200 బిలియన్ డాలర్ల డబ్బును ఖర్చు చేయబోతోంది. 100 మైళ్ల పొడవున్న సరళ నగరంలో కారు అవసరం ఉండదు. ఇది హై-స్పీడ్ ఆటోమేటిక్ పర్యావరణ అనుకూల వాహనాలను నడుపుతుంది. అతి సమీపంలో అంటే మరో ఏడేళ్లలో ఈ నగరం అందుబాటులోకి రానుంది.(Photo courtesy:neom website)
భవిష్యత్ నగరాలను సృష్టించే దేశాల్లో దక్షిణ కొరియా కూడా చేరింది.ఓషియనిక్స్ బుసన్( Oceanix Busan) వరల్డ్‌లోనే ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ సిటీగా మారుతుంది. దీని నమూనా ఇప్పటికే 2022 ఏప్రిల్‌లో ఐక్యరాజ్యసమితికి అందించబడింది. తీరప్రాంతాలలో ఉన్న ఈ నగరం పూర్తిగా రిపేరు చేయగల సామర్థ్యంతో స్వయం సమృద్ధిగా తేలియాడే నగరంగా మారుతుంది. ఇది తేలుతూనే ఉంటుంది కాబట్టి సముద్ర మట్టాలు పెరిగే ప్రమాదం ఉండదు.(Photo courtesy: oceanix wibsite)
చైనాలోని చెంగ్డు స్కై వ్యాలీ భవిష్యత్‌లో గొప్ప నగరంగా మారుతోంది. దీనిని ఎంవీఆర్‌డీవీ (MVRDV)అనే సంస్థ రూపొందించింది. ప్రాజెక్ట్ ప్రస్తుతం ఆగిపోయింది. ఇది ఆ ప్రాంతంలోని లోయలలో గ్రామీణ వర్గాల సాంప్రదాయ లిన్పాన్ స్థావరాన్ని మెరుగుపరచడానికి మరియు సంరక్షించడానికి రూపొందించబడింది. అగ్రికల్చరల్ సెఫ్టీ కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇక్కడ నివసించే వారి జీవనశైలి ప్రకృతి మధ్య ఉత్తమ సమతుల్యత కనిపిస్తుంది. (Photo courtesy: @MVRDV)
భారతదేశం ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి మాస్టర్ ప్లాన్‌ను ఫోస్టర్ అండ్ అసోసియేట్స్ రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ పనులు ప్రస్తుతం ఆగిపోవడం జరిగింది. ఇక్కడ నిర్మించే భవనాలు భవిష్యత్ అవసరాలను, సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని అద్భుతమైన విజన్‌తో రూపొందించబడింది. ఎలక్ట్రిక్ వాహనాలకు సాంకేతికత, వాటర్ ట్యాక్సీలు, సైకిళ్ల కోసం ప్రత్యేక లేన్లు వంటి అనేక సౌకర్యాలతో ఇది ప్రత్యేకంగా పర్యావరణం కోసం రూపొందించబడింది.(Photo courtesy: YouTube)