చైనాలోని చాలా ప్రావిన్సుల్లో ముసలివారి సంఖ్య పెరిగిపోతోంది. యంగ్ జనరేషన్ సంఖ్య తగ్గిపోతోంది. ప్రజలేమో.. ఒక సంతానాన్నే కంటున్నారు. ఇద్దరు పిల్లల్ని కనేందుకు ఇష్టపడట్లేదు. దాంతో చైనాలోని స్థానిక ప్రభుత్వాలకు ఇదో పెద్ద తలనొప్పి అయిపోయింది. ముఖ్యంగా సిచువాన్ ప్రావిన్స్ పాలకులకు ఏం చెయ్యాలో అర్థంకాక.. చివరకు సరికొత్త స్కీమ్ తెరపైకి తెచ్చారు. పెళ్లితో పనిలేదు.. పిల్లల్ని కనండి అంటున్నారు.
చైనాలో పరిస్థితి దారుణంగా ఉంది. 1990 నుంచి వేగవంతమైన అభివృద్ధిని సాధించిన చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలేలా ఉంది. కారణం సరిపడా జనాభా లేకపోవడమే. యంగ్ జనాభా లేని కారణంగా.. ఆ దేశంలోని అన్ని రంగాల్లో ఆర్థిక ఉత్పత్తి పడిపోయేలా ఉంది. అదే జరిగితే.. డ్రాగన్ దేశం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతుంది. ఆ పరిస్థితి రాకుండా స్థానిక ప్రభుత్వాలు రకరకాల ఆఫర్స్ ఇస్తున్నాయి.