Time Traveller : టైమ్ ట్రావెల్ అనేది సినిమాల్లో సైన్స్ ఫిక్షన్ థియరీ. అది నిజంగానే ఉందంటూ అప్పుడప్పుడూ కొంతమంది తమను తాము టైమ్ ట్రావెలర్లుగా చెప్పుకుంటున్నారు. వీళ్లంతా టిక్‌టాక్ ద్వారా తమను పరిచయం చేసుకుంటూ.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెబుతున్నారు. ఈమధ్య మరో వ్యక్తి ఇలాగే చెబుతూ.. వైరల్ అయ్యాడు. (images credit - tiktok - theradianttimetraveler)
అతని పేరు ఎనో ఎల్రిక్. టిక్‌టాక్‌లో ది రేడియన్ టైమ్ ట్రావెలర్ (theradianttimetraveler) అకౌంట్ కలిగివున్నాడు. తాను 2671 సంవత్సరం నుంచి వచ్చానని తెలిపాడు. 2022 సంవత్సరం డిసెంబర్లో భారీ ఘటనలు జరుగుతాయని తెలిపాడు. ఎల్రిక్.. టిక్‌టాక్‌లో పోస్ట్ చేసిన తాజా వీడియోకి 7వేలకు పైగా లైక్స్ వచ్చాయి. (images credit - tiktok - theradianttimetraveler)
20 సెకండ్ల వీడియోలో డిసెంబర్ 8, 12, 25 తేదీల్లో ఏదైనా జరుగుతుందన్న ఎల్రిక్.. డిసెంబర్ 20న రిలీజ్ ఉంటుందని చెప్పాడు. ఇంతకీ ఆ నాలుగు తేదీల్లో ఏం జరుగుతుందో చెప్పని ఎల్రిక్.. అందరూ సురక్షితంగా ఉండాలి అన్నాడు. దాని అర్థం.. ఏదైనా చెడు జరుగుతుంది అనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది మరో అడుగు ముందుకేసి.. గత నెలలో కూడా ఇలాగే చెప్పావు.. ఏదీ జరగలేదు అని అతనికి వ్యతిరేకంగా కామెంట్స్ ఇచ్చారు. (images credit - tiktok - theradianttimetraveler)
ఎల్రిక్కి టిక్‌టాక్‌లో 1.10 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. తనకు 10 లక్షల మంది ఫాలోయర్స్ వచ్చాక తనను తాను అందరికీ చూపించుకుంటానని తెలిపాడు. నవంబర్‌లో మనుషులు కొత్త గ్రహాల్ని కనిపెడతారనీ, ఓ పెద్ద సునామీ వస్తుందనీ, గ్రహాంతరవాసుల్ని మనుషులు కలుస్తారనీ అతను చెప్పాడు. ఇవేవీ జరగలేదు. ఫాలోయర్ల సంఖ్యను పెంచుకునేందుకే ఇలాంటివి చెబుతున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.