Financial Support: నిరుద్యోగులకు శుభవార్త.. నిరుద్యోగభృతికి గ్రీన్ సిగ్నల్.. ఎక్కడంటే..
Financial Support: నిరుద్యోగులకు శుభవార్త.. నిరుద్యోగభృతికి గ్రీన్ సిగ్నల్.. ఎక్కడంటే..
Financial Support: సౌదీ అరేబియా దేశంలోని నిరుద్యోగులకు పండగ లాంటి వార్త. అక్కడి ప్రభుత్వం యవతకు ఆర్థిక భరోసా కల్పించడానికి నిరుద్యోగభృతి ఇవ్వాలని నిర్ణయించింది.
సౌదీ అరేబియా దేశంలోని నిరుద్యోగుల విషయమై అక్కడి ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియా దేశంలోని యువతకు చేదోడుగా నిరుద్యోగభృతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
ఆ దేశ మంత్రి మండలి నిర్ణయం మేరకు అర్హులైన వారికి 15 నెలల ఆర్థికసాయం అందనుంది. అయితే ఈ నిరుద్యోగ భృతి ని నాలుగు విభాగాలుగా అందించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
మొదటి నాలుగు నెలలు రూ.39 వేలు (2 వేల సౌదీ రియాల్), తర్వాత నాలుగు నెలలు రూ.29, 308 (1500 సౌదీ రియాల్) ఆ తరువాత మూడు నెలలు రూ. 19,539 చొప్పున (1000 సౌదీ రియాల్).. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
చివరి మూడు నెలలు రూ.14654 (750 సౌదీ రియాల్) చొప్పున ఇవ్వనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు గల యువతి, యువకులు ఈ ఆర్థిక సాయానికి అర్హులు. అలాగే సౌదీ పౌరులు, శాశ్వత నివాసితులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
వేరే ప్రాంతం నుంచి వచ్చిన వారికి ఈ సహాయం అందదని ప్రభుత్వం స్పష్టం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)