అది రష్యాలోని సైబీరియా. అక్కడికి వెళ్లిన కొందరు సాహసికులు తిరిగి వెనక్కి రాలేదు. వాళ్లు ఏమయ్యారో కనుక్కుందామని రష్యా పోలీసులు అక్కడికి వెళ్లారు. వారు కూడా తిరిగి రాలేదు. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త వైరల్ అవుతుంది. ఆ తర్వాత అక్కడ ప్రత్యేకమైన జాంబీ వైరస్లు యాక్టివ్ అయ్యాయనీ.. అవే వారిని చంపేశాయని ప్రపంచానికి తెలుస్తుంది. సరిగ్గా ఇలాంటి ఫిక్షన్ స్టోరీనే గుర్తు చేస్తున్నారు పరిశోధకులు. ఇందుకు వారు జరిపిన తాజా పరిశోధనలను వివరిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఆ పాథోజెన్లకు జాంబీ వైరస్లు (zombie viruses) అని పేరు పెట్టారు. జనరల్‌గా చనిపోయిన వారు.. బతికినట్లుగా ఉంటూ.. మనుషుల రక్తం తాగేందుకు ప్రయత్నిస్తే.. అలాంటి వారిని జాంబీలు అంటారు. సినిమాల్లో తప్ప రియల్‌గా ఇలాంటి వారు లేరు. కానీ ఈ వైరస్లు ఇన్నేళ్ల తర్వాత కూడా తిరిగి బతకగలవు అంటున్నారు శాస్త్రవేత్తలు. అందుకే వాటిని అలా పిలుస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ వైరస్లు బయటకు వస్తే.. ఎంతకాలం అవి దాడి చేస్తాయన్నది అప్పుడే చెప్పలేమనీ.. బయట ఉన్న వాతావరణంపై అది ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవి బయటకు వచ్చే అకాశాలు ఇప్పుడు ఉన్నాయి. ఎందుకంటే వాతావరణంలో వేడి పెరుగుతోంది. భూతాపం వల్ల మంచు కరుగుతోంది. అందువల్ల ఆ మంచులో ఉన్న వైరస్లు ఇప్పుడు రిలీజ్ అవ్వగలవు. దీనిపైనే శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఓ బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. ఈ వైరస్లలో ఎక్కువ శాతం అమీబా మైక్రోబ్స్‌పై దాడి చేసే రకాలే. వీటిపై ఇప్పటివరకూ పరిశోధనలేవీ చెయ్యలేదు. ఇవి మనుషులు, జంతువులపై దాడి చేస్తే.. తీవ్రత ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడున్న వ్యాక్సిన్లు వీటిని చంపగలవో లేదో కూడా తెలియదు. అందువల్ల ఇవి ఇప్పుడు దాడి చేస్తే సమస్యే అంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
చైనాలో వచ్చిన కరోనా.. ప్రపంచంపై దాడి చేస్తే.. వ్యాక్సిన్ తయారీకి సంవత్సరానికి పైగా టైమ్ పట్టింది. వ్యాక్సిన్ పంపిణీకి మరో సంవత్సరం పట్టింది. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ చైనాలో కరోనా పోలేదు. మరి సైబీరియా జాంబీ వైరస్ యాక్టివ్ అయితే.. ప్రపంచానికి మరో సవాల్ తప్పదు అంటున్నారు శాస్త్రవేత్తలు. (ప్రతీకాత్మక చిత్రం)
ఆ వైరస్లు యాక్టివ్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంటుంది. భూతాపం పెరగకపోతే.. ఆ వైరస్లు బయటకు రావు. కానీ వాస్తవంలో ఆ పరిస్థితి లేదు. భూమిపై వేడి నానాటికీ పెరుగుతూనే ఉంది. ప్రపంచ దేశాలు సదస్సుల్లో చెబుతున్నది.. చర్యల్లో చూపించట్లేదు. అందువల్ల ప్రమాదం పొంచి ఉంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)