అటు అమెరికా నేతృత్వంలోని నాటో దళాలు.. ఇటు కరడుగట్టిన రష్యా బలగాలు.. ఉక్రెయిన్ సరిహద్దుల వెంబడి ఉప్పెనలా పెరిగిన ఉద్రిక్తతలు.. ఉక్రెయిన్ నాటోలో చేరి క్రిమియాను కెలికితే అణుయుద్ధం తప్పదని పుతిన్ హెచ్చరిక.. రష్యా ఆక్రమణకు దిగితే నాటో దళాల దూకుడు ప్రకటనలు.. అమెరికానే రెచ్చగొడుతోందని ఉక్రెయిన్ విరుద్ధ ప్రకటన.. ఇదీ అక్కడ తాజా పరిస్థితి
దక్షిణ, ఉత్తర సైనిక ప్రాంతాల వద్ద ఉన్న బలగాలను వెనక్కి పంపినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. డ్రిల్స్ పూర్తి చేసుకున్న తర్వాత తమ దళాలు కొన్ని సరిహద్దు నుంచి వెనక్కి మళ్లినట్లు రష్యా రక్షణ మంత్రి చెప్పారు. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం సైనిక శిక్షణ తీవ్ర స్థాయిలో జరుగుతోంది.