రద్దీ తగ్గితే కేసులు తగ్గుతాయి: జనం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో రద్దీ 20 శాతం తగ్గితే, అంటువ్యాధుల వ్యాప్తి 80 శాతం వరకు తగ్గుతుందని అధ్యయన బృంద సభ్యుడు జ్యూర్ లెస్కోవెక్ తెలిపారు. ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అమెరికాలో 10 అతిపెద్ద మెట్రోపాలిటన్ నగరాల్లో ఈ సర్వే చేశారు. కోవిడ్-19 వ్యాప్తిని గుర్తించడానికి పరిశోధకులు సేఫ్ గ్రాఫ్, సెల్ ఫోన్ లొకేషన్ డేటాను ఉపయోగించారు. రెస్టారెంట్లు, కేఫ్‌లు, గ్రాసరీ స్టోర్లు, జిమ్‌లు, హోటళ్లు, ప్రార్థనా స్థలాలు, ఆస్పత్రులు... వంటి ప్రదేశాల్లో తిరిగే జనాన్ని ట్రాక్ చేసి, పరిశోధన చేశారు. (image credit - twitter - Reuters)