Kamala Devi Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవడంతో... తమిళనాడులో సంబరాలు జరుపుకుంటున్నారు. అక్కడి దృశ్యాల్ని చూద్దాం.
US Election 2020: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ అధ్యక్షుడిగా, కమలా దేవి హారిస్ ఉపాధ్యక్షురాలిగా అద్భుత విజయం సాధించడంతో... తమిళనాడులోని కమలా దేవి తల్లి శ్యామలా గోపాలన్ సొంతూరైన తులసేంద్రపురంలో స్థానికులు సంబరాలు చేసుకుంటున్నారు.
2/ 5
కమలా హారిస్... తమ గ్రామానికే గర్వకారణం అంటూ... స్థానికులు రంగవల్లులతో ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
3/ 5
ఇలా చాలా ఇళ్ల ముందు రంగవల్లులు ఉన్నాయి. తమకు ముందే పండుగ వచ్చేసిందని వారంటున్నారు. నమస్తే అమెరికా అంటూ ట్యాగ్ లైన్ పెడుతున్నారు.
4/ 5
కమలా హారిస్ తల్లి... 1960లో చెన్నై నుంచి అమెరికా వెళ్లి... అక్కడ చదువుకుంటూ... జమైకన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
5/ 5
తాజాగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ 213 ఓట్లతో ఓడిపోగా... జో బిడెన్ 290 ఓట్లతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. నెక్ట్స్ అధ్యక్షుడవుతున్న జో బిడెన్ టీంలో... భారత సంతతి మహిళ అయిన కమలా హారిస్... ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. (credit - twitter - reuters)