Photos : నయాగరా జలపాతం గడ్డకడితే ఏమవుతుంది? సగం అమెరికా చీకట్లోకి వెళ్లిపోతుందా?
Niagara Falls : మనకు శ్రీశైలం, నాగార్జున సాగర్ ఎలాగో... అమెరికాకు నయాగరా జలపాతం కూడా కీలకమైనది. ఏటా అది గడ్డకట్టకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కొన్నిసార్లు సాధ్యపడదు. ప్రస్తుతం నయాగరా మంచుకొండలా మారింది. అందువల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం.


ప్రపంచంలోనే అతి పెద్ద జలపాతాల్లో ఒకటి నయాగారా జలపాతం అని మనకు తెలుసు. భారీ ప్రవాహంతో ఏటా కోట్ల మంది పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది ఈ వాటర్ ఫాల్స్. (Image: AP)


ప్రస్తుతం అమెరికాలో మైనస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండటంతో నయాగరా జలపాతం పూర్తిగా గడ్డకట్టేసింది. (Image: AP)


అమెరికాలో గత 50 ఏళ్లలో ఎప్పుడూ ఇంత చల్లటి వాతావరణం లేదు. ఇప్పుడా పరిస్థితి రావడంతో నయాగరా మంచు యుగాన్ని తలపిస్తోంది. (Image: AP)


మంచులో నయాగరా సరికొత్త అందాలతో ఆకట్టుకుంటోంది. దాన్ని చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. (Image: AP)


మరో వారం పాటూ నయాగరా ఇలాగే ఉంటుంది. చూడటానికి అద్భుతంగా ఉన్నా... అక్కడి అధికారులు మాత్రం తలలు పట్టుకుంటున్నారు. (Image: AP)


నయాగరా వల్ల ఏటా పెద్ద ఎత్తున కెనడా, అమెరికాకు ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అవుతోంది. చుట్టుపక్కల చాలా దేశాలకు అక్కడి మూడు విద్యుత్ కేంద్రాలు 4.4 గిగావాట్స్ కరెంటును సరఫరా చేస్తున్నాయి. (Image: AP)


1759 నుంచీ నయాగరా హైడ్రో ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేస్తున్నారు. 86 అడుగుల ఎత్తు నుంచీ జాలువారే ప్రవాహం అత్యంత శక్తిమంతమైన పవర్ అందిస్తోంది. (Image: AP)


కరెంటు ఉత్పత్తి అవ్వాలంటే నయాగరా జలపాతం ప్రవహిస్తూనే ఉండాలి. ప్రవాహం ఆగిపోతే కరెంటు ఉత్పత్తి నిలిచిపోతుంది. ప్రస్తుతం అదే జరుగుతోంది. (Image: AP)