ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime minister Narendra modi) శుక్రవారం ఇటలీ (Rome)కు చేరుకున్నారు. జీ-20 సమావేశాల్లో భాగంగా మోదీ మూడు రోజుల పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా శనివారం క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ (Pop Francis)తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. భారత్‌లో పరిస్థితులపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా మోదీ పోప్ ఫ్రాన్సిస్‌ను ఇండియాకు ఆహ్వానించారు. (Photo: PMOindia/Twitter)