కొంతమంది జీవితం రొటీన్‌గా ఉంటుంది. వాళ్ల గురించి మనం చెప్పుకునేంత ఏమీ ఉండదు. కొంతమంది లైఫ్ మాత్రం మలుపులతో ఉంటుంది. అలాంటి అమ్మాయే డానియెల్లీ మిల్లర్. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 33 వేల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఈ అకౌంట్‌ని గమనిస్తే.. రాయల్, లగ్జరీ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. కానీ ఆమె పగతో రగిలిపోతోందన్నది అసలు కథ. (image credit - instagram - thedaniellenicolemiller)
మిల్లర్ కాలి మడమకు ఓ సన్నటి బ్లాక్ బాక్స్‌ని పోలీసులు బలవంతంగా తగిలించారు. అది ఎప్పటికీ ఊడదు. దాని ద్వారా ఆమె ఎక్కడెక్కడ ఉన్నదీ పోలీసులకు తెలిసిపోతుంది. ఇదివరకు ఫ్లోరిడా బ్యాంక్ చీటింగ్ కేసులో ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. ఆ తర్వాత కూడా ఆమెలో మార్పు రాలేదు. (image credit - instagram - thedaniellenicolemiller)
కొంతమంది డబ్బున్న వ్యక్తుల్ని టార్గెట్ చేస్తున్న మిల్లర్.. వాళ్లతో చనువుగా ఉంటూ.. వాళ్ల ఐడీలు సంపాదిస్తోంది. ఆ తర్వాత బ్యాంక్ అధికారుల్ని బుట్టలో వేసుకొని.. నకిలీ ఐడీలతో.. కోట్లకు కోట్లు మనీ లోన్ తీసుకుంటోంది. ఆ తర్వాత ఆ లోన్లు చెల్లించట్లేదు. (image credit - instagram - thedaniellenicolemiller)
మిల్లర్ ఇలా అవ్వడానికి బలమైన కారణం ఒకటి ఉంది. చిన్నప్పుడు జరిగిన ఓ ఘటన ఆమె మనసును గాయపరిచింది. నిజానికి ఆమె ఓ సంపన్న కుటుంబానికి చెందినది. కానీ సెకండరీ స్కూల్లో చదివే రోజుల్లో.. 2004లో ఓ కుర్రాణ్ని ప్రేమించింది. అతను నువ్వు కన్యవే అని నిరూపించు అన్నాడు. (image credit - instagram - thedaniellenicolemiller)
మంచి కంటే చెడు వేగంగా వ్యాపిస్తుంది కదా.. మిల్లర్ విషయంలో అదే జరిగింది. దాంతో ఆమె పరువు పోయింది. నలుగురూ నాలుగు రకాలుగా అంటుంటే.. విసుగెత్తిపోయిన మిల్లర్.. సమాజంపై పగ పెంచుకుంది. తన జీవితాన్ని నాశనం చేశారు కాబట్టి.. తాను కూడా సమాజంలో మగాళ్లను టార్గెట్ చెయ్యాలి అనుకుంది. (image credit - instagram - thedaniellenicolemiller)