Miss World:ప్రపంచ సుందరిగా పోలాండ్ లేడీ..కిరీటం దక్కించుకున్న కరోలీనా బీలాస్కా
Miss World 2021:పోలాండ్‌కి చెందిన అందగత్తె..ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది. గతేడాది మిస్ వరల్డ్ పోటీల్లో 40 సెమీ ఫైనల్‌కి చేరుకుంటే అందులో కరోలీనా బీలాస్కా మిస్ వరల్డ్ టైటిల్ సొంతం చేసుకుంది.
మిస్ వరల్డ్ 2021 కిరీటాన్ని దక్కించుకుంది పోలెండ్ అందగత్తె కరోలీనా బీలాస్కా. పోర్టోరికోలోని శాన్ జువాన్ కోకా కోలా మ్యూజిక్హాలులో జరిగిన ప్రపంచ అందాల పోటీల్లో న్యాయ నిర్ణేతలు విజేతగా కరోలినా బీలాస్కా పేరును ప్రకటించారు.
2/ 10
మాజీ మిస్ వరల్డ్ టోనీ యాన్ సింగ్ నుంచి కిరీటం తీసుకున్న వెంటనే.. ఆమె భావోద్వేగానికి లోనైంది. ఈ నిజాన్ని తానిప్పటికీ నమ్మలేకపోతున్నానని చెప్పింది. ఈ ఘట్టాన్ని తాను జీవితాంతం గుర్తుంచుకుంటానని తెలిపింది.
3/ 10
ప్రపంచ సుందరి పోటీల్లో భారతీయ సంతతికి చెందిన అమెరికా అమ్మాయి శ్రీసైని ఫస్ట్ రన్నరప్‌గా నిలవడం విశేషం. కోట్ ది ఐవరీకి చెందిన ఒలీవియా యేస్ సెకండ్ రన్నరప్ గా నిలిచింది.
4/ 10
మిస్ వరల్డ్ పోటీలకు 40 మంది సెమీ ఫైనల్ కు వచ్చారు. వాళ్లలో కరోలీనా బీలాస్కా కిరీటాన్ని తన్నుకుపోయింది. మేనేజ్మెంట్లో మాస్టర్ డిగ్రీ చేస్తున్న బీలాస్కా అందులనే పీహెచ్డీ చేస్తానన్నారు.
5/ 10
స్టడీతో పాటే మోడల్‌గా కొనసాగాలన్నదే తన కోరిక అని అలాగే మోటివేషనల్ స్పీకర్ కావాలన్నది తన ఆంబిషన్గా చెప్పుకొచ్చింది కరోలీనా.
6/ 10
అనాధలు, అభాగ్యుల కోసం జూపా నా ప్రియాట్రినై అనే స్వచ్చంద సంస్థను నడుపుతోంది కరోలీనా. సమాజంలోని అసమానతలపైనా పోరాడుతోంది. అంటరానితనంపై పోరాటాన్ని సాగిస్తోంది.
7/ 10
ప్రతి ఆదివారం అన్యాయాన్ని ఎదుర్కొంటున్న వాళ్లకు న్యాయసాయం చేస్తోంది. వారికి ఆహారం, వస్త్రాల వంటి వాటిని పంపిణీ చేస్తోంది. కరోనా వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకోలేని వాళ్లందరికీ.. ప్రభుత్వంతో మాట్లాడి వ్యాక్సిన్ వేయించింది.
8/ 10
గతేడాది డిసెంబర్లోనే ఫైనల్స్ మిస్ వరల్డ్ ఫైనల్స్ నిర్వహించాల్సింది. కరోనా కారణంగా వాయిదా వేశారు. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలకు చెందిన అందాల భామలు మిస్ వరల్డ్ పోటీల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
9/ 10
ఫైనల్స్‌లో ప్రపంచ సుందరి పోటీల పేర్లను ప్రకటించిన తర్వాత మాజీ మిస్ వరల్డ్ టోనీ యాన్ సింగ్ క్రెయిన్‌కు సంఘీభావంగా గీతాన్ని ఆలపించింది.
10/ 10
భారత్ తరఫున హైదరాబాద్ అమ్మాయి మానస వారణాసి పోటీ పడినా ఆమెను అదృష్టం వరించలేదు. టాప్ 13కు మాత్రమే తను పరిమితమైంది. ప్రపంచ సుందరి కిరీటం 2017లో భారత్‌కు చందిన మానుషి చిల్లార్ దక్కించుకుంది.