వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిన్ ను ప్రధాని మోదీ కలిసిన సమయంలో ఆయన వెంట విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా ఉన్నారు. మోదీని మర్యాదపూర్వకంగా వాటికన్ సిటీలోకి ఆహ్వానించిన పోప్ ఫ్రాన్సిస్.. ఏకాంతమందిరంలో చర్చలు జరిపారు. మోదీ-పోప్ భేటీలో సంప్రదాయ అజెండాలు లేవని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.