కరోనా కారణంగా రెండేళ్ల పాటు వర్చువల్ గానే జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సు ఈసారి భౌతికంగా జరుగుతున్నది. ప్రధాని మోదీ తన మ్యూనిచ్ పర్యటనలో జీ 7 సదస్సులో పాల్గొనడంతో పాటు వివిధ దేశాల అధినేతలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. జూన్ 26, 27 తేదీల్లో ఆయన జర్మనీలో ఉంటారు. సుమారు 15 ఇతర కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొంటారు.
జర్మనీలోని మ్యునిచ్లో ప్రధాని మోదీ ప్రవాస భారతీయులతో భారీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. జర్మనీ పర్యటన ముగిసిన తర్వాత జూన్ 28న మోదీ యూఏఈ కి వెళ్తారు. ఇటీవల మరణించిన యూఏఈ రాజు, మాజీ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయేద్ అల్ నహ్యాన్ కు నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను మోదీ పరామర్శిస్తారు.