మూడు రోజుల యూరప్ పర్యటన ముగిసింది. సోమవారం బెర్లిన్ లో అడుగుపెట్టడంతో మొదలైన మారథాన్ యాత్రలో మోదీ జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ తో భేటీ అయ్యారు. ఇండియాకు జర్మనీ రూ.80వేల కోట్ల సాయం ఒప్పందాలు చేసుకున్నారు. మంగళవారం నాడు డెన్మార్క్ వెళ్లి కోపెన్‌హెగెన్ సిటీ వేదికగా నార్దిక్ దేశాల(డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఐర్లాండ్) అధినేతలతో కీలక చర్చలు జరిపారు. చివరి అంకంగా పారిస్ చేరుకున్న మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ను కలుసుకున్నారు.
యూరప్ పర్యటనలో భాగంగా భారత ప్రధాని బుధవారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలతోపాటు అంతర్జాతీయ పరిణామాలు, ఉక్రెయిన్-రష్యా యుద్ద సంక్షోభం గురించి నేతలు చర్చించుకున్నట్లు పీఎంవో తెలిపింది. జర్మనీ, డెన్మార్క్ పర్యటనలు ముగించుకున్నతర్వాత మోదీ బుధవారం పారిస్ చేరుకున్నారు.
ఫ్రాన్స్ అధ్యక్ష భవనం ఎలీసీకి చేరుకున్న మోదీకి మెక్రాన్ ఆలింగనాలతో స్వాగతం పలికారు. ఇటీవలే రెండోసారి అఅధ్యక్షుడిగా ఎన్నికైన మెక్రాన్ కు మోదీ అభినందనలు తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ద నివారణ, దాని వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కలుగుతోన్న నష్టాలకు నివారణ, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవడం తదితర అంశాలపై మోదీ-మెక్రాన్ చర్చించుకున్నారు.
‘నమస్తే ప్యారిస్’ అంటూ తన ఫ్రాన్స్ పర్యటన ప్రారంభమైందని ట్వీట్ చేసిన మోదీ.. ఫ్రాన్స్-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. అంతకుముందు.. బుధవారం ఉదయం డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగెన్‌లో జరిగిన 2వ ఇండియా-నార్డిక్ ప్రధానుల సదస్సులో మోదీ పాల్గొన్నారు.
నోర్దిక్ దేశాల అధినేతలతో రౌండ్ టేబుల్ సమావేశంలో అంతర్జాతీయ శాంతి, భద్రత, ఉక్రెయిన్ సంక్షోభం, పలు అంశాల్లో సహకారం, హరిత పరివర్తన, వాతావరణ మార్పులు, బ్లూ ఎకానమీ, సృజనాత్మకత వంటి పలు అంశాలను ప్రధాని మోదీ చర్చించారు. ఉక్రెయిన్‌లో తలెత్తిన సంక్షోభాన్ని భరత్ తన పలుకుబడి ఉపయోగించి నివారించాల్సిందిగా ఐదు నార్డిక్ దేశాలు మోదీకి విన్నవించుకున్నాయి.
భారత్-నార్డిక్ దేశాల సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుందామంటూ ప్రధానులు ఈ సదస్సులో ప్రతినబూనారు. ఆరు దేశాల మధ్య సమ్మిళిత వృద్ధి, స్వేచ్ఛా వాణిజ్యం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు కృషి చేయాలని నిర్ణయించారు. కరోనా అనంతర ఆర్థిక, ఆరోగ్య సవాళ్లను మరింత దీటుగా ఎదుర్కొనాల్సిన అవసరంపై చర్చించారు. వాతావరణ మార్పులు, జీవ వైవిధ్య నష్టం, ఆహార ఉత్పత్తి, ప్రపంచ వ్యాప్తంగా తరుగుతున్న వనరులు వంటి అంశాలపైనా చర్చించారు.
2వ ఇండియా-నార్డిక్ సదస్సుకు ముందుకు ప్రధాని మోదీ నార్వే, స్వీడన్, ఐస్లాండ్, ఫిన్లాండ్ దేశాల ప్రధానులతో వేర్వేరుగా భేటీ అయ్యారు. భారత్‌తో ఆయా దేశాలకు ఉన్న ద్వైపాక్షిక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. వాణిజ్యం, రక్షణ, పెట్టుబడులు, స్మార్ట్ నగరాలు, పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో మరింత సహకారం, వృద్ధి దిశగా పయనించాలని చర్చల్లో నిర్ణయించారు.
కోసం సంప్రదాయ పీ-75ఐ సబ్మెరైన్లను భారత్‌లోనే నిర్మించే ఉద్దేశంతో కేంద్రం రూపొందించిన ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. ఈ ఒప్పందాల్లో అంశాలు తమకు ఇబ్బందికరంగా ఉన్నాయని ఫ్రెంచ్ నేవీ ప్రకటించింది. ప్రధాని మోదీ పర్యటనకు ఒక రోజు ముందు ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగుతున్నట్టు ఫ్రాన్స్ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.