ఎన్నికలకు ముందు బీజేపీకి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
ఎన్నికలకు ముందు బీజేపీకి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
మరికొద్ది గంటల్లో భారత్‌లో తొలి దశ లోక్ సభ ఎన్నికలు జరగనున్న సమయంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో బీజేపీ గెలిస్తేనే ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు ముందుకు సాగుతాయని అన్నారు.పుల్వామా ఘటన తరువాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సమయంలో ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతకరించుకుంది.
భారత్‌లో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే... అది ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు మంచిదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
2/ 5
విదేశీ జర్నలిస్టులతో మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్... భారత్‌లో బీజేపీ గెలిస్తే కాశ్మీర్ అంశంపై చర్చలు జరిపే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు.
3/ 5
కాంగ్రెస్ గెలవాలని పాకిస్థాన్ కోరుకుంటోందని ప్రధాని నరేంద్రమోదీ సహా బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్న సమయంలోనే పాక్ ప్రధాని ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆసక్తి రేపుతోంది.
4/ 5
ఒకవేళ భారత్‌లో విపక్ష నాయకుడు(రాహుల్ గాంధీ) గెలిస్తే పాకిస్థాన్‌తో శాంతి చర్చలకు ఆటంకం కలుగుతుందని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించడం గమనార్హం.
5/ 5
ఇప్పటికే తమ భూభాగంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకుంటున్నామని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గతంలో ప్రకటించింది.