Nostradamus US Election Predictions: 16వ శతాబ్దపు తత్వవేత్త, ఫ్రాన్స్ జ్యోతిష నిపుణుడు నోస్ట్రడామస్... 2020 నవంబర్ 3న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్ని ముందే చెప్పాడా? మరైతే... ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? డొనాల్డ్ ట్రంప్ మళ్లీ గెలుస్తారా లేక... ప్రత్యర్థి జో బిడెన్‌కి ప్రజలు పట్టం కడతారా? అన్నది ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్ అయ్యింది. భవిష్యత్తులు ఎప్పుడు ఏం జరుగుతుందో... ఆకాశాన్ని చూసి అంచనావేసేవాడు నోస్ట్రడామస్. తన అంచనాల్ని ఆయన లెస్ ప్రాఫటీస్ (Les Propheties) అనే పుస్తకంలో రాశాడు. అందులో రాసినవి 90 శాతం కరెక్ట్ అవుతుండటంతో... మరి అధ్యక్ష ఎన్నికలపై ఆయన ఏం రాశాడన్నది చర్చగా మారింది. ట్రంప్ మళ్లీ గెలుస్తారని... నోస్ట్రడామస్ చెప్పినట్లుగా కొంత మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. (credit - twitter)
ప్రపంచాన్ని కరోనా వైరస్ చుట్టుముట్టినప్పుడు... నోస్ట్రడామస్ పుస్తకంపై భారీగా చర్చ జరిగింది. అదే సమయంలో... ఇక ప్రపంచం అంతమైపోయినట్లే అని చెప్పే... యుగాంతం పుస్తకాల సేల్స్ ఒక్కసారిగా పెరిగిపోయింది. నోస్ట్రడామస్... ట్రంపెట్ ('trumpet') అనే పదం వాడాడనీ.. చట్టాల్లో మార్పుల ద్వారా... మరోసారి ట్రంప్ అధికారంలోకి వస్తాడని ఆయన చెప్పినట్లు ప్రచారం చేస్తున్నారు. మరైతే... 1555 నాటి పుస్తకంలో నిజంగా ఏముంది? ట్రంప్ మళ్లీ గెలుస్తారని... నోస్ట్రడామస్ చెప్పాడా? (credit - twitter)
రాజకీయ నిపుణులు, విశ్లేషకులు... ట్విట్టర్లో జరుగుతున్న ప్రచారాన్ని తప్పుపడుతున్నారు. అసలు డేట్లు, టైమ్ వంటివి ఏవీ చెప్పకుండా రాసిన అంచనాల్ని నిజం అని ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎక్కడో ఏదో పదాన్ని పట్టుకొచ్చి... దాన్ని ట్రంపుకి లింకు పెట్టడం కరెక్టు కాదంటున్నారు. అసలు నోస్ట్రడామస్... అటు ట్రంప్, ఇటు జో బిడెన్ గురించి ఏమీ చెప్పలేదని అంటున్నారు. 2016లో ట్రంప్ గెలిచినప్పుడు కూడా ఇలాగే ఆయన మద్దతుదారులు... నోస్ట్రడామస్ చెప్పిందే నిజమైందని ప్రచారం చేశారు. 2020లో కూడా అలాగే జరుగుతుందని అన్నారు. (credit - twitter)
ఓ గొప్ప అమెరికా ఫ్యామిలీ... చాలా కాలం పాటూ అమెరికాను ఏలుతుంది అన్న మాటను నోస్ట్రడామస్ వాడారనీ... ఆ ఫ్యామిలీ ట్రంపేనని కొందరు అంటున్నారు. అదే సమయంలో... కెన్నడీ ఫ్యామిలీ కూడా కావచ్చు కదా... అని మరికొందరు తిప్పికొడుతున్నారు. ఈ డిబేట్లో మరోవాదన తెరపైకి వచ్చింది. ఏంటంటే... ఎన్నికల్లో ఓడిపోయే ట్రంప్... సైనిక శక్తితో తిరిగి అధికారాన్ని చేపడతారట. ఇది కూడా నోస్ట్రడామస్సే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంకో దారణం ఏంటంటే... ట్రంప్ ఓడిపోతారనీ... దాంతో... మూడో ప్రపంచ యుద్ధం వచ్చి... అది యుగాంతానికి దారితీస్తుందని... ఇది కూడా నోస్ట్రడామస్సే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. (credit - twitter)
ఇలా అమెరికా అధ్యక్ష ఎన్నికలకూ... నోస్ట్రడామస్ అంచనాలకూ లింక్ పెట్టేస్తున్నారు చాలా మంది నెటిజన్లు. ఐతే... స్కాలర్లు మాత్రం... అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి కానీ... ట్రంప్, జో బిడెన్ గురించి కానీ... నోస్ట్రడామస్ ఎక్కడా చెప్పలేదనీ... అసలు నోస్ట్రడామస్ అంచనాలు ఇంకా విస్తృత స్థాయిలో ఉన్నాయనీ... భూతాపం, భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాల పేలుళ్లు, ప్రపంచ నాశనం వంటి అంశాలనే నోస్ట్రడామస్ చెప్పాడు తప్ప... ఈ ఎన్నికలపై మాత్రం ఏమీ రాయలేదని అంటున్నారు. (credit - twitter)