మాట్లాడితే మిస్సైల్ టెస్ట్.. ఆవిలిస్తే ఆటంబాబు గురించి మాత్రమే మాట్లాడే ఉత్తరకొరియా నియంత నేత కిమ్ జోంగ్ ఉన గడిచిన వారం రోజులుగా మూతికి మాస్కు పెట్టుకొని చేతలకు పూనుకున్నారు. దేశంలో లక్షలకొద్దీ పెరుగుతోన్న కొత్త కేసులు, వేల సంఖ్యలో పిట్టల్లా రాలిపోతున్న జనం.. కనీసం ఫస్టు డోసు వ్యాక్సిన్లు కూడా పొందని, ఇప్పటిదాకా వ్యాక్సిన్ల సరఫరా లేని స్థితిలో రోగులు బతకడం సాధ్యమేనా? అనే అనుమానాల మధ్య కిమ్ తీరికలేకుండా కొవిడ్ రివ్యూలు నిర్వహిస్తున్నారు.
ఉత్తరకొరియాలో తొలి కొవిడ్ కేసు నమోదైన వారంలోపే మొత్తం కేసుల సంఖ్య ఏకంగా 10 లక్షలకు పెరిగింది. కిమ్ దేశంలో ఇప్పటిదాకా ఎవరూ వ్యాక్సిన్ తీసుకోని కారణంగా వేగంగా వ్యాప్తి చెందుతున్నది. అదీగాక ఇప్పుడక్కడ మనుగడలో ఉన్నది అత్యంత ప్రమాదకారి అయిన వేరియంట్. నార్త్ కొరియాలో కొవిడ్ పరిస్థితి మరికొద్ది రోజుల్లో ఇంకా దారుణంగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది.
ఉత్తర కొరియాలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంక్య 10 లక్షలు దాటేసింది. సాధారణంగా తన దేశానికి చెందిన నెగటివ్ విషయాలేవీ వెల్లడించని కొరియన్ మీడియా కరోనా విషయంలో మాత్రం ప్రపంచం నుంచి సాయం ఆశిస్తున్నట్లుగా వాస్తవాలను రిపోర్ట్ చేస్తున్నది. కరోనా దెబ్బను దేశం ఎలా కాచుకుంటున్నది, అధినేత కిమ్ ఏం చేస్తున్నది మీడియా ఎప్పటికప్పుడు వార్తలు ఇస్తున్నది.
కొవిడ్ కట్టడికి ప్రదాన సూత్రమైన మూడు టీలు (టెస్ట్, ట్రేస్, ట్రీట్) ఉత్తరకొరియాలో వేగంగా అమలయ్యే పరిస్థితి లేకపోవడంతో వైరస్ వాయువేగంతో వ్యాప్తి చెందుతున్నది సరిపడా కిట్లు లేని కారణంగా. భారీ ఎత్తున టెస్టులు నిర్వహించలేకపోతున్నారు. దీంతో వైరస్ చాపకింద నీరులా పాకి దేశాన్నే ముంచెత్తే పరిస్థితి ఏర్పడింది.
వేలాది మంది పాల్గొన్న ఆ కార్యక్రమంలో మాస్కులు, భౌతికదూరం వంటి నిబంధనలేవీ పాటించలేదు. అప్పటి నుంచే కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ వచ్చింది. కరోనా తాజా వ్యాప్తికి సైనిక పరేడ్ కారణం కావొచ్చని అంటున్నారు. ఇప్పటికైనా టీకాలు అందకుంటే ఉత్తరకొరియా తుడిచిపెట్టుకుపోయేంత స్థాయిలో వైరస్ విలయం ఉండొచ్చనే అనుమానాలున్నాయి.