మనం ఆఫ్రికా దేశాలకు వెళ్తే.. అక్కడి కరెన్సీ కంటే మన కరెన్సీ విలువ ఎక్కువ కాబట్టి మనకు ఖర్చులు తక్కువే అవుతాయి. అదే సంపన్న దేశాలకు వెళ్తే.. వాటి కరెన్సీ విలువ ఎక్కువ కాబట్టి.. మనకు ఖర్చులు ఎక్కువగా అవుతాయి. కానీ ఆ దేశాలకు వెళ్తే మాత్రం ప్రభుత్వాలే డబ్బు ఇస్తాయి. కాకపోతే ఒక్కటే కండీషన్. వెళ్లిన వారు అక్కడే ఉండాల్సి ఉంటుంది. అలాంటి 9 దేశాల విశేషాలు తెలుసుకుందాం. (ప్రతీకాత్మక చిత్రం)
Candela, Italy : ఇటలీలోని కాండెల్లా.. కాస్త రద్దీగానే ఉంటుంది. ఇక్కడ 2,700 మంది దాకా నివసిస్తున్నారు. మీరు అక్కడికి వెళ్లాలనుకుంటే.. అక్కడి మేయర్.. బ్రహ్మచారులకు రూ.77వేలు, ఫ్యామిలీస్‌కి రూ.1.90 లక్షలు ఇస్తారు. మీరు చేయాల్సిందల్లా ఆ ఊళ్లో ఉంటూ.. అద్దె ఇంట్లో నివసించాలి. ఉద్యోగం పొంది.. సంవత్సరానికి రూ.7 లక్షలకు పైగా సంపాదించాలి. ఓ ఏడాది వర్క్ వీసా తీసుకొని అక్కడికి వెళ్లి వ్యాపారం చెయ్యాలనుకునేవారికి కాండెలా బాగా సెట్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం - credit - unsplash)
Denmark : వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తల్ని డెన్మార్క్ ఆహ్వానిస్తోంది. తమ దేశంలో స్టార్టప్స్ ప్రారంభించమంటోంది. డెన్మార్క్ వెళ్లేవారికి డబ్బు మాత్రమే కాదు.. విద్య, ఆరోగ్యం, ఇతర సంక్షేమ పథకాలు కూడా లభిస్తాయి. వ్యాపారం ప్రారంభించేవారికి చాలా ఆర్థిక వెసులుబాట్లు లభిస్తాయి. తీరప్రాంత దేశమైన డెన్మార్క్ చాలా అందమైనది. అక్కడ చాలా మంది సైకిళ్లపై వెళ్తారు. పర్యావరణాన్ని బాగా కాపాడతారు. ప్రపంచంలో ఆనందకరమైన ప్రజలున్న దేశాల్లో డెన్మార్క్ ఒకటి. (ప్రతీకాత్మక చిత్రం - credit - unsplash)
Antikythera, Greece : గ్రీస్ లోని యాంటీకిథెరా దీవిలో అంతాకలిపి 50 మంది కంటే తక్కువ మందే ఉంటారు. మీరు అక్కడ నివసించాలి అనుకుంటే.. గ్రీక్ ఆర్థడాక్స్ చర్చి మీకు మనీ ఇస్తుంది. మీకు ఓ ఇల్లు, స్థలం ఇస్తుంది. అలాగే మొదటి మూడేళ్లూ నెలకు రూ.47,800 చొప్పున మనీ ఇస్తుంది. ఈ దీవిలో షాపులు ఉండవు. దీవి మాత్రం అందంగా ఉంటుంది. ఇక్కడి బీచ్‌లు ఆకట్టుకుంటాయి. పల్లె వాతావరణం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం - credit - unsplash)
Antikythera, Greece : గ్రీస్ లోని యాంటీకిథెరా దీవిలో అంతాకలిపి 50 మంది కంటే తక్కువ మందే ఉంటారు. మీరు అక్కడ నివసించాలి అనుకుంటే.. గ్రీక్ ఆర్థడాక్స్ చర్చి మీకు మనీ ఇస్తుంది. మీకు ఓ ఇల్లు, స్థలం ఇస్తుంది. అలాగే మొదటి మూడేళ్లూ నెలకు రూ.47,800 చొప్పున మనీ ఇస్తుంది. ఈ దీవిలో షాపులు ఉండవు. దీవి మాత్రం అందంగా ఉంటుంది. ఇక్కడి బీచ్‌లు ఆకట్టుకుంటాయి. పల్లె వాతావరణం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం - credit - unsplash)
Mauritius : మడగాస్కర్‌కి తూర్పున ఉండే.. మారిషస్ దీవి చాలా అందంగా ఉంటుంది. అక్కడికి వెళ్లిన వారికి ప్రభుత్వం రూ.37వేలు ఇస్తుంది. ఆ డబ్బుతో స్టార్టప్ ప్రారంభించవచ్చు. ఐతే.. మీరు ఏ వ్యాపారం చెయ్యబోతున్నారో ముందుగా కమిటీకి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రిపోర్టును పరిశీలించి.. మీకు అనుమతి ఇచ్చేదీ లేనిదీ కమిటీ నిర్ణయిస్తుంది. మారిషస్ వాతావరణం బాగుంటుంది. చదువు, ఆరోగ్యం విషయంలో మంచి నాణ్యతా ప్రమాణాలున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం - credit - unsplash)
Ponga Villages, Spain : స్పెయిన్ లోని పోంగా కమ్యూనిటీతో ఉండేందుకు సిద్ధపడేవారికి రూ.2.88 లక్షలు ఇస్తుంది అక్కడి ప్రభుత్వం. కొత్త దంపతులు.. పోంగా ప్రజలతో ఐదేళ్లు కలిసి జీవించాలి. అక్కడ వెయ్యి మంది కంటే తక్కువ మందే ఉన్నారు. ఏటా జనాభా సంఖ్య తగ్గుతోంది. మీకు పిల్లలు ఉంటే.. వారికోసం ప్రభుత్వం అదనంగా రూ.25వేలు ఇస్తుంది. అక్కడికి వెళ్లిన తర్వాత పిల్లలు పుట్టినా మనీ ఇస్తుంది. స్పెయిన్ అందమైన లాండ్ స్కేప్స్ ఉన్న దేశం. ఉద్యోగాల కొరత లేదు. పని మధ్యలో 2 గంటలు విశ్రాంతి తీసుకునే సదుపాయం అక్కడ ఉంది. (ప్రతీకాత్మక చిత్రం - credit - unsplash)
Sicily, Italy : ఇటలీలోని సిసిలీ.. ఓ చిన్న పట్టణం. దాదాపు 6వేల మంది ఉన్నా.. వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. జనాభా సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం రూ.85కే ఒక ఇంటిని అమ్ముతోంది. ఇల్లు కొనుక్కున్న వారు మూడేళ్లలో దాన్ని పడగొట్టి.. కొత్తది నిర్మించుకోవాలి. అందుకోసం ప్రభుత్వం రూ.14.40 లక్షలు ఇస్తుంది. అదనంగా మరో రూ.4.79 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ ఇస్తుంది. ఇల్లు పూర్తయ్యాక.. సెక్యూరిటీ డిపాడిట్ని వెనక్కి తీసుకుంటుంది. ప్రపంచంలో చాలా మంది వెళ్లాలనుకునే పట్టణంగా సిసిలీ ఉంది. (ప్రతీకాత్మక చిత్రం - credit - unsplash)
Albinen, Switzerland : అందమైన దేశం స్విట్జర్లాండ్‌లోని అల్బినెన్లో జనాభా సంఖ్య వేగంగా తగ్గుతోంది. అక్కడికి మీరు వెళ్లాలనుకుంటే మీకు రూ.20 లక్షలకు పైగా ప్రభుత్వం ఇస్తుంది. పిల్లల కోసం మరో రూ.8 లక్షలు ఇస్తుంది. రెండు షరతులు ఉన్నాయి. మీ వయసు 45 ఏళ్ల లోపు ఉండాలి. మీరు అక్కడ పదేళ్లు ఉండేందుకు సిద్ధపడాలి. చాలా మంది ప్రకారం అల్బినెన్ అందంగా ఉంటుంది. అక్కడ జీవించడం హాయిగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం - credit - unsplash)
Ireland : ఐర్లాండ్ ప్రభుత్వం ఎంటర్ప్రైజ్ ఐర్లాండ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి.. స్టార్టప్‌లను ప్రోత్సహిస్తోంది. అప్లికేషన్ పెట్టుకున్న వారు.. అనుమతి రాగానే ఐర్లాండ్ వెళ్లి ఉండొచ్చు. కావాల్సిన నిధులను ప్రభుత్వం ఇస్తుంది. అలాగే యూరోపియన్ యూనియన్‌లో వ్యాపారాన్ని విస్తరించుకునే అనుమతులు ఇస్తుంది. ఐర్లాండ్ ప్రజలు ఇట్టే ప్రేమిస్తారు. కొత్తవారిని వెంటనే తమతో కలిపేసుకుంటారు. తరచూ వేడుకలు జరుపుకుంటారు. అందువల్ల అక్కడికి వెళ్లగానే.. కొత్తగా వచ్చిన ఫీలింగ్ త్వరగానే పోతుంది. (ప్రతీకాత్మక చిత్రం - credit - unsplash)
Saskatchewan, Canada : కెనడాలోని సస్కాత్చెవాన్లో కాలేజీ గ్రాడ్యుయేట్లను అక్కడే ఉండేలా చేసేందుకు.. ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. వారితోపాటూ ఉండేందుకు బయటివారిని ఆహ్వానిస్తోంది. ఇందుకోసం రూ.12 లక్షలకు పైగా మనీ ఇస్తుంది. అక్కడికి వెళ్లేవారు పదేళ్లు ఉండాలి. పన్నులు చెల్లించాలి. ఐతే.. అక్కడికి వెళ్లేందుకు అందరికీ అనుమతి లేదు. ప్రభుత్వం చెప్పిన విద్యా సంస్థల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. ఆ ఊరు చాలా బాగుంటుంది. చాలా జాతీయ పార్కులున్నాయి. ఉద్యోగాల కొరత లేదు. (ప్రతీకాత్మక చిత్రం - credit - unsplash)
Korea, Thailand, and Vietnam : ఈ మూడు దేశాలూ దాదాపు ఇలాంటి బెనెఫిట్సే ఇస్తున్నాయి. ఇవి ఎక్కువగా యూరప్, అమెరికా దేశాల ప్రజలను ఆహ్వానిస్తున్నాయి. ఇక్కడికి వెళ్లిన వారికి ప్రభుత్వాలే ఉద్యోగం ఇచ్చి.. ఇంగ్లీష్ ఇతర నేర్పుతాయి. ఈ మూడు దేశాలకూ ప్రత్యేక చరిత్ర ఉంది. ఆహార అలవాట్లు కూడా ప్రత్యేకంగానే ఉంటాయి. రకరకాల ఫుడ్ టేస్ట్ చూడొచ్చు. రోజువారీ ఖర్చులు తక్కువగానే ఉంటాయి. జీవిత ప్రమాణాలు బాగుంటాయి. (ప్రతీకాత్మక చిత్రం - credit - unsplash)