న్యూజిలాండ్‌లో తాజాగా కొత్త కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్నాయి. శనివారం (మే 14న) ఒక్కరోజే 7,122 కొత్త కేసులు, 17 మరణాలు నమోదయ్యాయి. శుక్రవారం నాడు ఏకంగా 29 మంది చనిపోగా, 9,484 కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన మూడు వారాలుగా న్యూజిలాండ్ లో కొవిడ్ పరిస్థితి దిగజారుతూ వస్తున్నది. నెల రోజుల వ్యవధిలోనే 150కిపైగా మరణాలు నమోదయ్యాయి.ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 54వేలుగా ఉంది.
కరోనా వైరస్ తొలి కేసు నమోదైన తర్వాత అత్యంత కఠినంగా ఆంక్షలను అమలుచేసిన దేశాల్లో న్యూజిలాండ్ దేశవ్యాప్తంగా మార్చి నెలలో ఆంక్షాలను ఎత్తివేశారు. తాజాగా ఒమిక్రాన్ వ్యాప్తితో అక్కడ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. న్యూజిలాండ్ తో ఇప్పటిదాకా కరోనా వల్ల 909 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 10.03లక్షల కేసులు నమోదయ్యాయి.