కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వర్క్ కల్చర్ మారింది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో కంపెనీలు,లేదా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే(Work From Home)సౌకర్యం కల్పించబడింది. అయితే ఇప్పుడు కరోనా ప్రభావం చాలావరకు తగ్గిన నేపథ్యంలో గతంలో(కోవిడ్ కు ముందు)మాదిరిగా మళ్లీ కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రావాలని కోరుతున్నాయి. వీటన్నింటి మధ్య వర్క్ ఫ్రం హోం(ఇంటి నుంచే పనిచేయడం) చట్టబద్ధమైన హక్కుగా మార్చే ప్రక్రియలో ఒక దేశం ఉంది.