ఒమైక్రాన్ సబ్ వేరియంట్ల వల్ల మున్ముందు కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని WHO అధికారి మారియా వాన్ కెర్కోవ్ అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా నిబంధనలను సడలించడం, వేగంగా వ్యాపించే లక్షణం ఒమైక్రాన్ వేరియంట్లకు ఉండటం వల్ల కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. (image credit - REUTERS/Denis Balibouse/File Photo)
కరోనా కేసులు పెరుగుతున్నా.. కరోనా ప్రభావం తీవ్రంగా ఉండకపోవడానికి కారణం.. ప్రజల్లో పెరిగిన వ్యాధి నిరోధక శక్తి (Immunity) అని అంచనా వేసిన కెర్కోవ్.. అందరూ వ్యాక్సిన్లు వేసుకునేలా చెయ్యాలనీ.. ముఖ్యంగా కరోనా లక్షణాలు ఉన్నవారు, 60 ఏళ్లు దాటిన ముసలివారికి తప్పనిసరిగా వ్యాక్సిన్లు వెయ్యాలని సూచించారు.
జన్యుపరమైన డేటా, కరోనా ప్రభావం, ఎంత మంది ఆస్పత్రుల్లో చేరుతున్నారు?, ICUలో ఎంత మంది చేరుతున్నారు. మరణాల సంఖ్య, వ్యాక్సిన్ల పనితీరు వంటి వివరాలు ఎప్పటికప్పుడు ఇవ్వాలని WHO అధికారులు చైనాను కోరారు. జనవరి 3న జరిగే నెక్ట్స్ మీటింగ్లో డేటా ఇవ్వాలని కోరారు. ఐతే.. దీనిపై చైనా అధికారులు, సైంటిస్టులు కచ్చితమైన హామీ ఇవ్వలేదని తెలిసింది. (image credit - REUTERS/Thomas Peter)