malala yousafzai education: ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మలాలా.. సోషల్ మీడియాలో ఫొటోలు పంచుకున్న మలాలా

మలాలా యూసఫ్ జాయ్ (Malala Yousufzai). అందరికీ తెలిసిన పేరే. నోబెల్ అవార్డు (Nobel award) గ్రహీత. పాకిస్తాన్ దేశస్తురాలు. 15 ఏళ్ల వయసులో పాకిస్థాన్‌లో బాలికలను చదివించాలని (Girls Education) ప్రచారం చేసిన ఆమెపై తాలిబాన్ ముష్కరులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం ఆమెను బ్రిటన్‌ (Britain)కు తరలించి.. మెరుగైన చికిత్స అందించారు. ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో మలాలా (Malala)ను తాలిబన్లు వదిలేయక తప్పలేదు. లండన్లో అత్యుత్తమ చికిత్స తీసుకున్న అనంతరం ఆమె ప్రపంచాన్ని చూసింది.