అమెరికాలో అధ్యక్ష ఎన్నికల తరువాత ఫలితాలు రావడం ప్రారంభించాయి. డెమొక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్ మరియు ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య గట్టి పోరాటం ఉంది. అమెరికా అధ్యక్షుడికి అపరిమిత అధికారాలు ఉండటంతో పాటు, అతనికి కూడా మంచి జీతం లభిస్తుంది. అనేక రకాల అలవెన్సులు కూడా ఉన్నాయి. అలాగే అనేక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచంలోని ఏ రాష్ట్రపతికి ఇన్ని సదుపాయాలు ఉండవు.
అమెరికా అధ్యక్షుడి వార్షిక వేతనం 400,000 డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం రూ .2.9 కోట్లు. ఇది కాకుండా వివిధ ప్రోత్సాహకాలు, సౌకర్యాలను కల్పిస్తారు. తన తన పదవీకాలంలో నివసించేందుకు ఆయన వైట్ హౌస్ లో నివాసం పొందుతారు. అలాగే ఆయనకు వ్యక్తిగత విమానం, హెలికాప్టర్ సౌకర్యం కల్పిస్తారు. ఇక పదవీకాలం తరువాత, ఆయన రిటైర్మెంట్ పెన్షన్ కు అర్హులు. ఇక అమెరికా అధ్యక్షుడు తన పదవీకాలంలో ప్రభుత్వ ఖజానా నుండి చాలా సదుపాయాలు పొందుతారు.
అమెరికా అధ్యక్షుడికి సంవత్సరానికి 50,000 డాలర్లు (రూ. 40 లక్షలు) ఖర్చు భత్యం లభిస్తుంది. సాలీనా లక్ష డాలర్ల (80 లక్షల రూపాయలు) ప్రయాణ ఖర్చులకు చెల్లిస్తారు. దీనిపై పన్ను ఉండదు. అదే సమయంలో, వారు వినోద భత్యంగా ఏటా 19000 డాలర్లు (14 లక్షల రూపాయలు) పొందుతారు. అమెరికా అధ్యక్షుడి జీతానికి పన్ను విధించినా ఆయన అందుకున్న భత్యాలకు పన్ను విధించరు.
2001 లో, అమెరికా అధ్యక్షుడి జీతం, 200,000 (రూ. 1.45 కోట్లు) గా ఉండేది, కాని ఇప్పుడు కాంగ్రెస్ దానిని రెట్టింపు చేసింది. అలాగే, 50,000 వ్యయ భత్యాలను అదనంగా చేర్చారు. అయితే, డోనాల్డ్ ట్రంప్ విషయానికి వస్తే, అతను అధ్యక్షుడు అవ్వడానికి ముందే పెద్ద వ్యాపారవేత్త. అతడు వ్యాపార వేత్తగా సంపాదించిన డబ్బుతో పోల్చి చూస్తే అతను అధ్యక్షుడిగా సంపాదించింది... చాలా తక్కువ. ఫోర్బ్స్ ప్రకారం, ట్రంప్ ఆస్తులు 3.1 బిలియన్ డాలర్లు (రూ .2.3 లక్షల కోట్లు).
ప్రతి అమెరికన్ అధ్యక్షుడికి నివాసం ఉండేందుకు వైట్ హౌస్ కాంప్లెక్స్ లభిస్తుంది, ఇది చాలా సురక్షితం. దీనిని మొదట అమెరికా అధ్యక్షుడికి 1792 లో కేటాయించారు. ఇందులో ఆరు అంతస్తులు, 132 గదులు ఉన్నాయి. ఇందులో టెన్నిస్ కోర్టులు, మరెన్నో గదులతో స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. వైట్ హౌస్ లో 51 సీట్ల థియేటర్ కూడా ఉంది. సినిమాల ప్రదర్శనతో పాటు స్పోర్ట్స్ ఈవెంట్స్ ఇందులో చూడవచ్చు.
అధ్యక్షుడు ఆయన కుటుంబం వైట్ హౌస్ ను తమదైన రీతిలో అలంకరించడానికి 100,000 భత్యం పొందుతారు. బరాక్ ఒబామా అధ్యక్షుడైనప్పుడు, అతను ఈ నిధిని ఉపయోగించలేదు, కానీ ఈ వ్యయాన్ని పేద ప్రజల సంక్షేమం ఉపయోగించారు. కానీ ట్రంప్ అధ్యక్షుడైనప్పుడు, ఆయన ఫర్నిచర్, గోడల అలంకరణ కోసం 1.75 మిలియన్లను పెట్టుబడి పెట్టాడు.
అమెరికా రాష్ట్రపతి ఎక్కడికైనా వెళ్లేందుకు బోయింగ్ 747 విమానం వినియోగిస్తారు. దీని పూర్తి స్థలం 4000 చదరపు అడుగులు. ఇందులో మెడికల్ ఆపరేటింగ్ రూమ్, ప్రెసిడెంట్ కోసం ప్రైవేట్ రూమ్, ఒకేసారి 100 మందికి కూర్చునే వీలుగా హాల్ ఉన్నాయి. అది ఎగిరినప్పుడు, ఒక గంటలో 200,000 ఖర్చవుతుంది. రాష్ట్రపతి సేవలో మెరైన్ వన్ హెలికాప్టర్ కూడా ఉంది.