కిలో అరటిపండ్లు కొనాలంటే 50 రూపాయలు ఉంటే సరిపోతుంది. కానీ ఓ చోట మాత్రం కిలో అరటి పండ్లు కొనలాంటే రూ. 3400 ఖర్చు చేయాల్సిందే. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
అయితే ఇది భారతదేశంలో మాత్రం కాదు. మరి ఎక్కడ అంటారా.. ఉత్తర కొరియాలో. మరి అరటిపండ్లకు ఇంత రేటు ఏమిటి అనుకుంటున్నారా.. అక్కడ కేవలం అరటిపండ్లకు మాత్రమే కాదు, ప్రస్తుతం ఆహార పదార్థాల ధరలు అన్నీ కూడా ఇలానే ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం-కిమ్(ఫైల్ ఫొటో))
3/ 6
ఇందుకు కారణం ఉత్తర కొరియాలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొంది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అధికారికంగా అంగీకరించారు. తుపాన్ల కారణంగా వరదలు రావడంతో.. వ్యవసాయ రంగం లక్ష్యాలను చేరుకోలేకపోయిందని కిమ్ పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం-కిమ్(ఫైల్ ఫొటో))
4/ 6
మరోవైపు కరోనా నేపధ్యంలో ఉత్తర కొరియాలో తీవ్రమైన ఆంక్షలు అమలు చేశారు. కొరియా తన సరిహద్దులను మూసేసింది. ఈ క్రమంలోనే దేశంలోని ఆహార నిల్వలు అడుగంటిపోయాయి. మరోవైపు వరదల కారణంగా ఉత్పత్తి తగ్గింది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
ఆహారం, ఇంధనం, ఎరువులు తదితరాల కోసం ఉత్తర కొరియా చైనామీదే ఆధారపడాల్సిన పరిస్థితి. అయితే కరోనా ఆంక్షల నేపథ్యంలో చైనా నుంచి దిగుమతులు తగ్గిపోయాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
ఈ క్రమంలోనే ఉత్తర కొరియాలో ఆహార ధరలు పెరిగాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అక్కడ ఒక కిలో అరటిపండుకు $ 45(భారత కరెన్సీలో రూ. 3400) ఖర్చవుతుందని NK News పేర్కొంది.(ప్రతీకాత్మక చిత్రం)