కమలా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం పట్ల హర్షం వ్యక్తంచేస్తూ సోషల్ మీడియా వేదికగా పలువురు భారత రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు స్పందించారు. భారత నెటిజన్లు సైతం సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తంచేశారు. అయితే మరికొందరు ప్రవాస భారతీయులు మాత్రం తాము డొనాల్డ్ ట్రంప్ వైపే ఉంటామని...కమలా ఉపాధ్యక్ష అభ్యర్థిత్వం ద్వారా తాము ప్రభావితం కాబోమని చెబుతున్నారు.