Kamala Harris: కమలా దేవి హారిస్ గురించి మీకు తెలియని 10 అరుదైన అంశాలు
Kamala Harris: కమలా దేవి హారిస్ గురించి మీకు తెలియని 10 అరుదైన అంశాలు
Kamala Devi Harris: జనవరిలో అమెరికా ఉపాధ్యక్షురాలిగా... నాలుగేళ్ల తర్వాత అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా బరిలో దిగబోతున్న కమలా దేవి హారిస్‌కి సంబంధించి 10 ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
కమలా హారిస్... అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నుంచి అష్టాంగ డిస్ట్రిక్ అటార్నీ అయిన తొలి మహిళ. అలాగే... ఆమె దక్షిణాసియా నుంచి ఎన్నికైన అమెరికా సెనెటర్ కూడా.
2/ 10
ట్రంప్ ఆమెను అసహ్య (Nasty)మైన మహిళ అంటూ... జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో... పిచ్చి కోపం వచ్చిన ప్రజలు... బ్యాలెట్ బాక్స్ ద్వారా ట్రంప్‌కి బుద్ధి చెప్పారు.
3/ 10
కమలా హారిస్, ఆమె సోదరీ... ఇద్దరూ... అమెరికాలోని ఓ నల్లజాతీయుల బాప్టిస్ట్ చర్చి, ఓ హిందూ ఆలయం దగ్గర్లోనే పెరిగారు.
4/ 10
అమెరికాలో పౌర హక్కుల ఉద్యమం జరుగుతున్న రోజులవి. ఆ సమయంలోనే కమలా హారిస్ తల్లిదండ్రులు గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్‌గా ఉంటూ ప్రేమలో పడ్డారు. కమలా హారిస్ తల్లి అలాంటి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు.
5/ 10
కమలా హారిస్ సోదరి... మాయాను... హిల్లరీ క్లింటన్... తన తరపు లాయర్‌గా నియమించుకున్నారు.
6/ 10
తన పాలనా కాలంలో... బరాక్ ఒబామా... అమెరికా అటార్నీ జనరల్‌గా కమలా హారిస్ పేరును నామినేట్ చేశారు. ఐతే... కమలా ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు.
7/ 10
2019లో డెమొక్రాట్ల తరపున అభ్యర్థిగా ముందుగా కమలా హారిస్ పేరే తెరపైకి వచ్చింది. ఐతే... ఆర్థికంగా డబ్బు లేకపోవడంతో... ఆమె రేస్ నుంచి పక్కకు తప్పుకున్నారు. లేదంటే ఇప్పుడే ఆమె అధ్యక్షురాలు అయ్యేవారే.
8/ 10
కమలా హారిస్ తల్లి... బెస్ట్ కాన్సర్ స్పెషలిస్ట్. 1960లోనే ఆమె చెన్నై నుంచి ఆమెరికా వెళ్లి... ఎండోక్రినాలజీలో డాక్టరేట్ పొందారు.
9/ 10
తాను నల్లజాతీయురాలిని కాబట్టి... తనతో తెల్లజాతీయుల పిల్లలు ఆడుకోవడానికి వారి పేరెంట్స్ అనుమతిచ్చే వారు కాదని ఓ ఇంటర్వ్యూలో కమలా హారిస్ తెలిపారు.
10/ 10
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిగా నిలిచేందుకు ఓ దశలో కమలా హారిస్... జో బిడెన్తోనే తలపడాలనుకున్నారు. ఆ తర్వాత తనే ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఆ తర్వాత జో బిడెన్ స్వయంగా ఆమెను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంచుకోవడంతో... ఇక డెమొక్రాట్లంతా ఒక్కటై విజయం సాధించారు.