జో బిడెన్ అమెరికా అధ్యక్షుడు అవ్వనుండడం వల్ల... ఎవరి జాతకాలు ఎలా మారబోతున్నా... ఆ కుక్కలకు మాత్రం రాజభోగం దక్కుతోంది. బిడెన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాక... సంప్రదాయం ప్రకారం... తన భార్యతో కలిసి... వైట్‌హౌస్‌లో అడుగు పెడతారు. ఈ దంపతులతోపాటూ... 2 పెంపుడు కుక్కలు కూడా వెంట వెళ్తాయి. అధ్యక్షుడు దేశ ప్రథమ పౌరుడు కాబట్టి... ఆయన భార్య... దేశ ప్రథమ పౌరురాలు అవుతుంది. అలాగే... అధ్యక్షుడి కుక్కలను దేశ ప్రథమ కుక్కలుగా భావిస్తూ... వాటికి రాచమర్యాదలు చేయనున్నారు. వచ్చే 4 ఏళ్లపాటూ వాటికి ఈ రాజభోగం దక్కనుంది.
ఆ రెండు కుక్కలూ... జర్మన్ షెపర్డ్ జాతికి చెందినవే. వాటి పేర్లు ఛాంప్, మేజర్ 7. ఈ జాతి కుక్కలు పెద్దగా అరవవు. యాక్టివ్ గా ఉండవు. కానీ... ఎప్పుడైనా ఎవరినైనా టార్గెట్ చేస్తే మాత్రం... కండ పట్టుకుంటే... అది ఊడేదాకా వదలవు. యజమానులు చెప్పినట్లు వింటాయి. అందుకే ఈ కుక్కలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.
ఇలా వైట్హౌట్కి పెంపుడు జంతువుల్ని తెచ్చే సంప్రదాయం ఇప్పటిది కాదు. జార్జి వాషింగ్టన్... తొలిసారిగా కుక్కను వెంట తెచ్చారు. ఆ తర్వాత వస్తున్న అధ్యక్షులందరూ... ఏవో ఒక ప్రాణులను తెస్తూనే ఉన్నారు. ట్రంప్ మాత్రం డిఫరెంట్. ఆయన ఏ ప్రాణులనూ పెంచట్లేదు. అందువల్ల వేటినీ వెంట తేలేదు. నాలుగేళ్లుగా వైట్‌హౌస్‌లో ఏ కుక్కలూ లేవు.