Ivana Trump: ట్రంప్ మొదటి భార్య మృతి వెనుక అనుమానాలు.. అలా జరగడం వల్లే చనిపోయారా?
Ivana Trump: ట్రంప్ మొదటి భార్య మృతి వెనుక అనుమానాలు.. అలా జరగడం వల్లే చనిపోయారా?
Ivana Trump Death: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ గురువారం అనుమానాస్పద రీతిలో మరణించిన విషయం తెలిసిందే. మరి ఆమె ఎలా చనిపోయారు? వైద్యులు ఏం చెప్పారు? ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ మన్ హటన్లోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆమె మరణించిందని వార్తలు వచ్చాయి తప్ప.. దానికి కారణమేంటన్నది మొదట తెలియలేదు. వైద్య పరీక్షల అనంతరం ఆమె మృతికి గల కారణాలను వైద్యులు వెల్లడించారు.
2/ 6
శరీరంపై మొద్దు బారిన గాయాల ప్రభావం వల్లే ఇవానా ట్రంప్ ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు తెలిపారు. తన ఇంట్లో మెట్లపైనుంచి కాలుజారి పడటం వల్ల గాయాలపాలై మరణించారని తెలుస్తోంది. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.
3/ 6
ఇవానా అపస్మారక స్థితిలో పడి ఉనట్లుగా... ఆమె ఇంటి నుంచి ఫోన్ వచ్చిందని అధికారులు వెల్లడించారు. అక్కడి వెళ్లి చూస్తే.. ఆమె ఘటనా స్థలంలోనే మరణించి ఉన్నట్లు తెలిపారు. ఐతే ఏదైనా నేరం జరిగినట్లుగా అక్కడ ఆనవాళ్లు కన్పించలేదని.. ప్రమాదశాత్తు మెట్లపై నుంచి కిందపడిపోయి ఉండవచ్చని పేర్కొన్నారు.
4/ 6
ఇవానా ట్రంప్ మరణించిందని గురువారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆమె గొప్ప, అందమైన మహిళని ఆయన పేర్కొన్నారు. ఇవానాకు తన ముగ్గురు పిల్లలు డొనాల్డ్ జూనియర్, ఇవాంక, ఎరిక్లే సర్వస్వమని చెప్పారు.
5/ 6
కాగా, ఇవానా ట్రంప్ మోడల్‌గా పనిచేశారు. 1977లో అప్పుడు రియల్ ఎస్టేట్ డెవలపర్‌గా ఉన్న ట్రంప్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 1978లో డొనాల్డ్ జూనియర్, 1981లో ఇవాంక, 1984లో ఎరిక్ జన్మించారు. 1993లో ఇవానా, డొనాల్డ్ ట్రంప్ విడాకులు తీసుకున్నారు.
6/ 6
అనంతరం మార్లా మేపుల్స్‌ను డొనాల్డ్ ట్రంప్ రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమెతో అఫైర్ కారణంగానే ఇవానా విడాకులు ఇచ్చినట్లు ప్రచారం ఉంది. ఐతే 1999లో మార్లా మేపుల్స్‌కు కూడా విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత 2005లో మెలానియా ట్రంప్‌ను మూడో పెళ్లి చేసుకున్నారు ట్రంప్.