కెల్లీ కాస్టిల్లే (33), కోడీ వర్క్‌మాన్ (32)... ఈ జంట... ప్రపంచ దేశాలు తిరుగుతూ... ఎప్పటికప్పుడు తమ అప్డేట్స్ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తోంది. ఐతే... వీళ్లు పెట్టే ఫొటోలు... నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఎందుకంటే వీళ్లు డేంజరస్ స్టంట్స్ చేస్తూ... ఆ ఫొటోలు పోస్ట్ చేస్తున్నారు. ఇదో బుద్ధి తక్కువ పని అనీ, స్టుపిడ్స్లా వ్యవహరిస్తున్నారనీ ఫాలోయర్లు ఫైర్ అవుతున్నారు. (Image - insta - positravelty)
తాజాగా ఈ జంట మరో ఫొటో పెట్టింది. అందులో... కోడీ... పెరూలోని ఓ పర్వతంపై కూర్చొని ఉండగా... క్యాజిల్ అతని చేతిని పట్టుకొని... ఒక కాలును మాత్రమే పర్వతంపై పెట్టి... మరో కాలును గాల్లో వదిలేసింది. ఆమె పొరపాటున జారితే... ఇద్దరికీ ప్రమాదమే. పర్వతం కింద పెద్ద సరస్సు ఉంది. అందులో మొనదేలిన పర్వత కొనలు ఉండే అవకాశాలున్నాయి. ఇలాంటి స్టంట్ చేయడం వల్ల సాధించేదేముందని నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. (Image - insta - positravelty)
డేంజరస్ స్టంట్స్, రొమాంటిక్ ఫొటోలు పెడుతున్న ఈ జంట నిర్వహిస్తున్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పేరు పాజిట్రావెల్ట్రీ. దీనికి 1.61 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఆ మధ్య ఇదే జంట ఇలాంటి భయంకరమైన ఫొటోనే పెట్టింది. అందులో... అనంతమైన ఓ పూల్ పక్కన డ్రామాటిక్ ఫొటో తీసుకున్నారు. దానిపైనా తీవ్ర విమర్శలొచ్చాయి. (Image - insta - positravelty)
తాము చేసే స్టంట్లు, ఫొటోలకు తమదే పూర్తి బాధ్యత అంటున్న వీళ్లు... తమకు ఏమీ కాదనీ... అన్ని జాగ్రత్తలూ తీసుకొనే ఇలాంటి స్టంట్స్ చేస్తున్నామనీ చెబుతున్నారు. కానీ ఫాలోయర్లు మాత్రం... ఇలాంటివి చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న మిమ్మల్ని ఎందుకు ఫాలో అవ్వాలని ప్రశ్నిస్తున్నారు. మిమ్మల్ని చూసి... ఇంకెవరైనా ఇలా చేస్తే... ప్రాణాలకే ప్రమాదం... అంటూ మండిపడుతున్నారు. (Image - insta - positravelty)
ఈ జంట మాత్రం... తమ అకౌంట్ మిగతా అకౌంట్ల లాగా... రోటీన్‌గా ఉండదనీ... క్రియేటివ్‌గా ఉంటుందని చెప్పుకుంటోంది. అందులో ఫొటోగ్రఫీ, జాలి, కొత్తదనం, పాజిటివిటీ ఇలా అన్ని కోణాలూ ఉంటాయని అంటోంది. (Image - insta - positravelty)
2017 అక్టోబర్ వరకూ వీళ్లు వేర్వేరుగా ట్రావెల్ చేసేవాళ్లు. అప్పట్లో పనామాలో వీళ్లు కలిశారు. ఇద్దరివీ ఒకే రకమైన ఆలోచనలు కావడంతో... వీళ్ల మధ్య లవ్ వర్కవుట్ అయ్యింది. ఇప్పుడు ఇద్దరూ కలిసి ట్రావెల్ చేస్తున్నారు. ఫలితంగా డబ్బు ఆదా అవ్వడమే కాక... బోర్ లేని లైఫ్ స్టైల్ అనుభవిస్తున్నారు. (Image - insta - positravelty)