ప్రపంచ ప్రఖ్యాత సంస్థ 'ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్' మంగళవారం 'కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ (CPI)ని విడుదల చేసింది. ప్రపంచంవ్యాప్తంగా మొత్తం 180 దేశాలకు ఆయా దేశాల్లో అవినీతి స్థాయిని బట్టి ర్యాంకు ఇచ్చారు. భారత్ ఒక ర్యాంకును మెరుగుపరచుకొని 85వ స్థానానికి చేరుకోగా..పాకిస్తాన్ 120 నుంచి 140వ స్థానానికి చేరుకుంది.
ఈ జాబితాలో దక్షిణ సూడాన్ 180వ స్థానంలో నిలిచింది. అంటే ప్రపంచంలోనే అవినీతి ఎక్కువగా ఉండే దేశం సౌత్ సూడాన్. దీనికి ముందు సిరియా, సోమాలియా, వెనిజులా, యెమెన్ దేశాలులు ఉన్నాయి. అవినీతి నిరోధక చర్యలు పెరుగుతున్నప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని నివేదిక తెలిపింది. మానవ హక్కులు, ప్రజాస్వామ్యంపై దాడులు పెరుగుతున్నాయని పేర్కొంది.
2021 గ్లోబల్ 'కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్'లో 180 దేశాలలో పాకిస్థాన్ 16 స్థానాలు దిగజారి.. 140వ ర్యాంక్‌కు చేరుకుందని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ తెలిపింది. తాము అధికారంలోకి వస్తే పాకిస్తాన్‌ను అవినీతి రహిత దేశంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బ.