ఇప్పటివరకూ ఇండియాలో థర్డ్ వేవ్ వస్తుందా రాదా అనే డౌట్ ఉండేది... నాలుగు రోజులుగా పెరుగుతున్న కేసుల్ని బట్టీ... థర్డ్ వేవ్ వచ్చేసినట్లే అంటున్నారు. ఐతే... మూడో వేవ్‌కి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం కాలేదనే వాదన వినిపిస్తోంది. వ్యాక్సిన్లు వేస్తున్నారు తప్పితే... ఆస్పత్రుల్లో ఫెసిలిటీస్ ఏమాత్రం పెంచలేదనీ, పిల్లల కోసం ఎలాంటి అదనపు జాగ్రత్తలూ తీసుకోలేదనే వాదన వినిపిస్తోంది. స్కూళ్లలో కూడా సరైన జాగ్రత్తలు తీసకోవట్లేదు కాబట్టే పిల్లలకు కరోనా వచ్చేస్తోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మాత్రం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామనీ, థర్డ్ వేవ్‌ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నాయి. (image credit - twitter - reuters)
అమెరికాలో చిత్రంగా ఉంది. అక్కడ సగం మందికి పైగా ఫైజర్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అయినా కరోనా కేసులు ఏకంగా లక్షా 80 వేల దాకా రోజూ వస్తున్నాయి. ఇక వ్యాక్సిన్ వేయించుకొని ఏం ప్రయోజనం అనే మాటలు వినిపిస్తున్నాయి. మృతుల సంఖ్య కూడా రోజూ వెయ్యికి పైగానే ఉంటోంది. అసలు వ్యాక్సిన్లు సరిగా పనిచేస్తున్నాయా అనే డౌట్ ప్రజలకు వస్తోంది. వ్యాక్సిన్లే గనక పనిచేస్తే... మరణాలు అంతలా ఎందుకు వస్తున్నాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. (image credit - twitter - reuters)
డెల్టా వేరియంట్ వల్ల ఇండియాలో సెకండ్ వేవ్ వచ్చింది. అదే వేరియంట్ వల్ల మళ్లీ ఇప్పుడు థర్డ్ వేవ్ కూడా వస్తోంది అంటున్నారు. మరి మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. డెల్టా వేరియంట్ వల్లే థర్డ్ వేవ్ వచ్చే పరిస్థితి ఉంటే... దాదాపు నెల పాటూ కేసులు ఎందుకు తగ్గాయన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వేరియంట్ చాలా భయంకరంగా ఉంది అని బ్రిటన్ తెలిపింది. ఇతర వేరియంట్ల కంటే ఈ వేరియంట్ 2 రెట్లు ఎక్కువ ప్రమాదకరంగా ఉందనీ, ఆస్పత్రుల్లో రోగులు చేరే ఛాన్స్ 2 రెట్లు ఎక్కువగా ఉందని అంటోంది. (image credit - twitter - reuters)
కరోనా ఒకసారి సోకి, తగ్గిన వారు కోవాగ్జిన్ (Covaxin) ఒక్క డోస్ వేసుకుంటే చాలు అని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ (ICMR) చెప్పింది. ఎందుకంటే.. కరోనా వచ్చి తగ్గిన వారిలో ఆల్రెడీ యాంటీబాడీలు బాగా ఉంటాయి. అందువల్ల ఒక్క డోస్ వేసుకున్నా సరిపోతుందని చెబుతోంది. ఒక్క డోస్ తీసుకున్నా, రెండు డోసులు తీసుకున్నా మార్పు పెద్దగా కనిపించలేదని తమ అధ్యయనంలో తేలినట్లు ICMR తెలిపింది.
ఇండియాలో కొత్తగా 31,374 మంది రికవరీ అయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 3,18,52,8028కి చేరింది. రికవరీ రేటు 97.6 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్‌లో 3,59,775 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 17,61,110 టెస్టులు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 51 కోట్ల 68 లక్షల 87 వేల 602 టెస్టులు చేశారు. కొత్తగా 1,03,35,290 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 62 కోట్ల 29 లక్షల 89 వేల 134 వ్యాక్సిన్లు వేశారు. (image credit - twitter - reuters)
AP Covid: ఏపీలో కొత్తగా 64,461 టెస్టులు చెయ్యగా... కొత్తగా 1,321 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 20,10,566కి చేరింది. కొత్తగా 19 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 13,807కి చేరింది. కొత్తగా 1,499 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 19,81,906కి చేరింది. ప్రస్తుతం 14,853 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,64,71,272 టెస్టులు జరిగాయి. (image credit - twitter)
Telangana Covid: తెలంగాణలో కొత్తగా 325 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 6,57,119కి చేరాయి. కొత్తగా 424 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 6,47,185కి చేరింది. రికవరీ రేటు 98.48 శాతంగా ఉంది. రాష్ట్రంలో కొత్తగా ఇద్దరు మరణించారు. మొత్తం మరణాలు 3,869కి చేరాయి. మరణాల రేటు 0.58 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,065 యాక్టివ్ కేసులున్నాయి. (image credit - twitter)
World Covid: ప్రపంచదేశాల్లో కొత్తగా 5,11,721 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 21.66 కోట్లు దాటింది. కొత్తగా 8,464 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 45.06 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.85 కోట్లు ఉన్నాయి. ఇవి మరింత పెరిగాయి. అమెరికాలో కొత్తగా 47,165 కేసులు, 589 మరణాలు వచ్చాయి. బ్రెజిల్లో నిన్న 24,699 కొత్త కేసులు, 614 మరణాలు సంభవించాయి. (image credit - twitter - reuters)