ఈ విషయం బయటపడటంతో... అసలేం జరుగుతోంది అని అధికారులు లోతుగా విశ్లేషించగా... గత డిసెంబర్లో బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత... ఆ కోళ్ల ఫారంలో పనిచేసే ఏడుగురు వర్కర్లు అనారోగ్యం పాలయ్యారని తెలిసింది. ఐతే... ప్రస్తుతానికి ఆ ఏడుగురూ ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారని రష్యాకి చెందిన వినియోగదారుల ఆరోగ్య పరిశీలనా సంస్థ నిర్వాహకురాలు అన్నా పొపొవా తెలిపారు. (image credit - twitter)
బర్డ్ ఫ్లూ సోకిన వ్యక్తి నుంచి వైరస్ స్ట్రెయిన్ (మనుషులకు సోకగలిగే రూపాంతర వైరస్)ను సేకరించింది రష్యాలోని వెక్టార్ ల్యాబొరేటరీ. ఇప్పుడా స్ట్రెయిన్ జన్యు పటాన్ని పరిశీలిస్తారు. ఇప్పటివరకూ ఉన్న H5N8 బర్డ్ ఫ్లూ వైరస్ పక్షులకే సోకుతోంది. అది మనుషులకు సోకిందంటే దాని అర్థం ఆ వైరస్‌లో అలాంటి మార్పులు (Mutation) వచ్చినట్లే. అందుకే ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసుకునేందుకు జన్యు పదార్థాన్ని సేకరించారు. (image credit - twitter)
ప్రస్తుతం రూపాంతరం చెందిన బర్డ్ ఫ్లూ వైరస్... మనుషుల నుంచి మనుషులకు సోకేలా లేదని అంటున్నారు. అలాగని ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదు. జస్ట్ మూడు నెలల్లో ఆ వైరస్ రూపాంతరం చెందింది. మరో మూడు నెలల్లో అది మరింతగా రూపాంతరం చెంది... మనుషుల నుంచి మనుషులకు చేరే ఛాన్స్ లేకపోలేదని పొపోవా తెలిపారు. దాన్ని ఎదుర్కొనేందకు ప్రపంచ దేశాలు, పరిశోధకులు రెడీ అవ్వాలని కోరారు. ఆల్రెడీ రష్యా సైంటిస్టులు పని మొదలుపెట్టారు. ఆ వైరస్ నుంచి మనుషులను ఎలా కాపాడాలో, ఏయే మందులు వాడాలో వంటి అంశాలపై ఫోకస్ పెడుతున్నారు. (image credit - twitter)
మీకు డౌట్ వచ్చే ఉంటుంది. ఇదివరకు కూడా బర్డ్ ఫ్లూ మనుషులకు సోకింది కదా అని. అవును. సోకింది. అయితే... అది మరో రకమైన వైరస్. ఇప్పుడు సోకినది H5N8 రూపాంతర వైరస్. ఇదివరకటి వాటి కంటే ఇది ప్రమాదకరంగా ఉంది. చాలా వేగంగా పక్షుల్లో వ్యాపించింది. అందువల్ల దీని విషయంలో ఆందోళన ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. (image credit - twitter)