కారు యాక్సిండ్ చేసిన హాలీవుడ్ యాక్షన్ స్టార్..ప్రమాదంలో ఆమెకు గాయాలు
కారు యాక్సిండ్ చేసిన హాలీవుడ్ యాక్షన్ స్టార్..ప్రమాదంలో ఆమెకు గాయాలు
OMG: లాస్ ఏంజిల్స్‌లో హాలీవుడ్ యాక్షన్ స్టార్ అర్నాల్డ్ స్కార్జెనెగర్ కారు మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఓ మహిళ గాయపడింది. మరో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. యాక్సిడెంట్ జరిగిన సమయంలో నటుడు ఎలాంటి మాదకద్రవ్యాలు, మద్యం సేవించలేదని పోలీసులు తెలిపారు.
హాలీవుడ్ యాక్షన్ స్టార్, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ ష్వార్జెనెగర్ కారు ఢీకొని ఓ మహిళ గాయపడింది. ఈప్రమాదంలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు.
2/ 6
బ్రెంట్‌వుడ్‌లోని రివేరా కంట్రీ క్లబ్‌కు సమీపంలో ఈయాక్సిడెంట్ జరిగింది. ఆర్నాల్డ్ మెగా ఎస్యూవీ జీఎంసీ యుకానన్ కారులో వెళ్తుండగా అలెన్ఫోర్డ్ అవెన్యూ కూడలి దగ్గర టయోటా ప్రియస్ కారును ఢీకొట్టింది.
3/ 6
ఈఘటనలో యాక్షన్ హీరోకు ఎలాంటి గాయాలు తగల్లేదు. హీరో ఢీకొట్టిన కారులో ఉన్న మహిళకు స్వల్పగాయాలయ్యాయి. ఆమెకు రక్తస్రావం కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
4/ 6
కారు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న లాస్ ఏంజిల్స్ పోలీసులు నటుడు ఆర్నాల్డ్ ప్రమాదం జరిగిన సమయంలో మద్యం , డ్రగ్స్ తీసుకోలేదని నిర్ధారించారు.
5/ 6
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటన స్తలంలో ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఢీకొన్న కార్లను తొలగించారు. ఈకేసులో ఇంకా విచారణ కొనసాగుతోందని లాస్ ఏంజిల్స్ పోలీసులు వెల్లడించారు.
6/ 6
ఈప్రమాదంలో మరో రెండు కార్లు కూడా ఒకదానికొకటి ఢీకొన్నట్లుగా తెలుస్తోంది. కారు యాక్సిడెంట్లో యాక్షన్ స్టార్‌కి ఎలాంటి గాయాలు కాలేదని ఆయన పర్సనల్ అసిస్టెంట్ మీడియాకు వెల్లడించారు.