ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల బృందం .. CRISPR అనే టెక్నాలజీతో టైప్-బీ తెల్లరక్తకణాల జన్యువుల్లో మార్పులు చేసి.. హెచ్ఐవీ–ఎయిడ్స్‌ను కట్టడి చేసే కొత్త వ్యాక్సిన్‌ను కనుగొంది. టెల్ అవీవ్ యూనివర్సిటీకి చెందిన న్యూరో బయోలజీ, బయో కెమిస్ట్రీ, బయో ఫిజిక్స్ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు నిర్వహించిన తర్వాత ఈ వ్యాక్సిన్‌ను రూపొందించారు.
టెల్ అవీవ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధన వివరాలను నేచర్ జర్నల్ ప్రచురించింది. ఈ వ్యాక్సిన్ ద్వారా శరీరంలో ఉత్పన్నమయ్యే యాంటీ బాడీస్ అత్యంత సమర్థంగా ఉన్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. ఒక్క డోసు వ్యాక్సిన్‌తో హెచ్ఐవీ రోగుల్లో వైరస్‌ను తటస్థీకరించేలా చేయడంలో శాస్త్రవేత్తలు తొలి దశలో విజయం సాధించారు.
ఎముకల మజ్జలో బీ-టైప్‌గా పిలిచే తెల్లరక్త కణాలు తయారవుతాయి. పరిపక్వం చెందిన తర్వాత అవి ఎముక మజ్జ నుంచి రక్తం, గ్రంథుల వ్యవస్థలోకి వెళ్తాయి. అక్కడి నుంచి వివిధ అవయవాలకు చేరుకుంటాయి. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించే కణాలు ఇవే. బి-కణాలు ఎదురుపడిన్నప్పుడు.. హెచ్ఐవీ వాటిని విచ్ఛిన్నంచేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఐతే ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు వైరస్‌లోని కొన్ని భాగాలను ఉపయోగించి.. బి-కణాల జన్యువుల్లో మార్పులు చేశారు. ఇలా మార్పులు చేసిన కణాలు.. హెచ్ఐవీకి ఎదురుపడినా.. దాని ప్రభావానికి గురికావు. వైరస్ ప్రవర్తనను పసిగట్టి..దానికి అనుగుణంగా మారిపోతాయి. అలా హెచ్వీఐవీని అడ్డుకునే యాంటీబాడీలను ఉత్పత్తి చేసేలా రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రస్తుత పరిశోధనలో ఆశాజనక ఫలితాలు వచ్చాయి. ఈ టీకాతో యాంటీ బాడీలు ఉత్పత్తయ్యి..హెచ్ఐవీ వైరస్‌పై పోరాడుతున్నాయి. ఐతే జన్యు మార్పులు చేసిన తెల్లరక్త కణాలతో ఎయిడ్స్‌ను అడ్డుకునే ఔషధాన్ని రూపొందించేందుకు.. మరికొన్ని లోతైన పరిశోధనలు, హ్యూమన్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంది. ఇవన్నీపూర్తయ్యే మందు అందుబాటులోకి వచ్చేందుకు మరికొన్నేళ్ల సమయం పట్టొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)