Haiti Earthquake: హైతీలో భారీ భూకంపం.. 304 మంది మృతి.. కూలిన భవనాలు.. హృదయవిదారక దృశ్యాలు
Haiti Earthquake: హైతీలో భారీ భూకంపం.. 304 మంది మృతి.. కూలిన భవనాలు.. హృదయవిదారక దృశ్యాలు
కరేబియన్ దేశం హైతీలో శనివారం ఘోరమైన భూకంపం సంభవించింది. రాత్రిపూట వచ్చిన ఈ భూకంపం అనంతరం అనేక భవనాలు కుప్పకూలాయి. తమ బంధువులు, స్నేహితులను వెతుక్కుంటూ అనేక మంది శిథిలాలను రాత్రంతా తొలగిస్తూనే ఉన్నారు. ఈ భూకంపంలో 304 మంది మృతి చెందగా.. 1800 మందికి పైగా గాయపడ్డారు.
కరేబియన్ దేశం హైతీలో శక్తివంతమైన భూకంపంతో జనజీవనం అస్తవ్యస్థం అయ్యింది. 7.2 తీవ్రతతో వచ్చిన భూకంపంక కారణంగా 300 మందికి పైగా చనిపోయారు. 1800 మంది గాయపడ్డారు.
2/ 11
హైతీలోని లాస్ కేవ్స్లో కూలిపోయిన భవనాలు. (REUTERS TV via REUTERS THIS IMAGE HAS BEEN SUPPLIED BY A THIRD PARTY. MANDATORY CREDIT. - RC265P9LOJV0)
3/ 11
అగస్టు 14 సంభవివించిన భూకంలో భవనాలు, హోటల్స్ కూలిపోయాయి. శిధిలాల తొలిగింపు కార్యక్రమం వేగవంతంగా జరుగుతున్నది. 2010లో వచ్చిన భూకంపం నుంచే ప్రజలు ఇంకా కోలుకోలేదు. ఇంతలోనే మరో భూకంపం అతలాకుతలం చేసింది. (Photo by Stanley LOUIS / AFP)
4/ 11
కూలిపోయిన భవనం ఎదుట నిలబడిన హైతీ ప్రజలు. (TWITTER @JCOMHaiti/ via REUTERS ATTENTION EDITORS - THIS IMAGE HAS BEEN SUPPLIED BY A THIRD PARTY. MANDATORY CREDIT. MUST NOT OBSCURE LOGO - RC205P92WUYW)
5/ 11
హైతీలోని జెరేమీ పట్టణంలో కూలిపోయిన భవనాల శిథిలాలను దాటుకుంటూ వెళ్లున్న స్థానిక ప్రజలు. (TWITTER @JCOMHaiti/ via REUTERS ATTENTION EDITORS - THIS IMAGE HAS BEEN SUPPLIED BY A THIRD PARTY. MANDATORY CREDIT. MUST NOT OBSCURE LOGO - RC205P9DETG5)
6/ 11
భూకంపం కారణంగా గాయపడిన వందలాది మందికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సరైన వసతులు లేక నేలపైనే పడుకోబెట్టి చికిత్స చేస్తున్నారు. ఇది కేస్ జనరల్ ఆసుపత్రిలో కనిపించిన దృశ్యం ఇది. (Photo by Stanley LOUIS / AFP)
7/ 11
కేస్ జనరల్ ఆసుపత్రిలో వందలాది మంది క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ఈ భూకంపంలో 304 మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. (Photo by Stanley LOUIS / AFP)
8/ 11
హైతీ రాజధానికి 100 మైళ్ల దూరంలో భూకంప కేంద్ర కేంద్రీకృతమై ఉన్నది. అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. (Photo by Stanley LOUIS / AFP)
9/ 11
2010లో వచ్చిన భారీ భూకంపం నుంచే ఇంకా ఎవరూ కోలుకోలేదు. ఇప్పుడు ఈ భారీ భూకంపం మరోసారి హైతీ ప్రజల జనజీవనాన్ని అస్తవ్యస్థం చేసింది. (Photo by Stanley LOUIS / AFP)
10/ 11
అనేక పురాతన కట్టడాలు కూడా నేలమట్టం అయ్యాయి. (TWITTER @JCOMHaiti/ via REUTERS ATTENTION EDITORS - THIS IMAGE HAS BEEN SUPPLIED BY A THIRD PARTY. MANDATORY CREDIT. MUST NOT OBSCURE LOGO - RC205P9SCMKI)
11/ 11
కూలిన భవనాల్లో ఎవరైనా చిక్కుకున్నారేమో అని స్థానిక ప్రజలు వెతుకుతున్నారు. హైతీ భూకంప తర్వాత ప్రభుత్వం సహాయక చర్యలు ప్రారంభించింది. (REUTERS TV via REUTERS THIS IMAGE HAS BEEN SUPPLIED BY A THIRD PARTY. MANDATORY CREDIT. - RC265P9RUF0W)