GADDAM MEGHANA INDIAN ORIGIN TELUGU GIRL GADDAM MEGHANA ELECTED AS NEW ZEALAND YOUTH PARLIAMENT MP MKS
Gaddam Meghana: న్యూజిలాండ్ యువ ఎంపీగా 18ఏళ్ల తెలుగమ్మాయి.. గడ్డం మేఘన ఘనత
ఏ దేశమేగినా.. ఎందు కాలిడినా.. ఏ పీఠమెక్కినా.. ఎవ్వరేమనినా.. పొగడరా నీతల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవము.. పాడరా నీ తెలుగు బాలగీతములు.. అంటూ రాయప్రోలు సుబ్బా రావు రాసిన జాతీయగీతాన్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు న్యూజిలాండ్ లోని భారత సంతతి ప్రజలు. గడ్డం మేఘన మరోసారి తెలుగు ఖ్యాతిని ఖండాంతరాల్లో చాటింది. వివరాలివి..
భారత సంతతి బాలిక, అందునా అచ్చ తెలుగమ్మాయి గడ్డం మేఘన(18)కు న్యూజిలాండ్‌లో అరుదైన గౌరవం దక్కింది. న్యూజిలాండ్ యువ పార్లమెంట్ సభ్యురాలిగా ఆమె ఎన్నికయింది.
2/ 7
ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా టంగుటూరుకు చెందిన మేఘన న్యూజిలాండ్ దేశ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ప్రపంచ దేశాల్లో నిర్వహించే యూత్ పార్లమెంట్లలో అత్యంత శక్తిమంతమైనదిగా పేరుపొందింది న్యూజిలాండ్ యూత్ పార్లమెంట్.
3/ 7
న్యూజిలాండ్ యూత్ పార్లమెంట్ కు నామినేటెడ్ ఎంపీ పదవుల తాజాగా ఎంపిక జరిగింది. దీనిలో భాగంగా 'సేవా కార్యక్రమాలు, యువత' విభాగానికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ సభ్యురాలిగా గడ్డం మేఘన ఎన్నికయ్యారు.
4/ 7
వాల్కటో ప్రాంతం నుంచి యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా మేఘన నామినేటెడ్ పదవీకి ఎంపికయ్యారు. మేఘన తల్లిదండ్రులు న్యూజిలాండ్‌లోనే స్థిరపడ్డారు. ఫిబ్రవరిలో మేఘన ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
5/ 7
గడ్డం మేగన తండ్రి గడ్డం రవికుమార్ ఉద్యోగ రీత్యా 2001లో న్యూజిలాండ్ వెళ్లారు. అలా 21 ఏళ్ల క్రితం భార్య ఉషతో కలిసి న్యూజిలాండ్ వెళ్లిన రవికుమార్ అక్కడే స్థిరపడిపోయారు. అక్కడే పుట్టి పెరిగిన మేఘన.. కేంబ్రిడ్జిలోని సెయింట్ పీటర్స్ హై స్కూల్లో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు.
6/ 7
స్కూల్ డేస్ నుంచే మేఘన చారిటీ కార్యక్రమాలు చేపడుతున్నారు. తోటి స్నేహితులతో కలిసి విరాళాలు సేకరించి అనాథ శరణాలయాలకు ఇస్తున్నారు. అలాగే ఆ దేశానికి వలస వచ్చిన ఇతర దేశాల శరణార్థులకు విద్య, ఆశ్రయం, కనీస వసతులు కల్పించడంలో కీలక పాత్ర పోషించారు.
7/ 7
మేఘన చేపట్టిన సేవాకార్యక్రమాలకు గుర్తింపుగా న్యూజిలాండ్ ప్రభుత్వం ఆమెను పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపిక చేసింది. గతేడాది డిసెంబర్ 16న జరిగిన ఈ ఎంపిక విషయాన్ని వాల్కటో ప్రాంత ప్రభుత్వ ఎంపీ టీమ్ నాన్ డిమోలెన్ తాజాగా మేఘన ఫ్యామిలీకి తెలియజేశారు.