ఇండోనేషియా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది. ఎందుకంటే ఈ దేశ పార్లమెంటు త్వరలో ఒక చట్టాన్ని ఆమోదించబోతోంది. పెళ్లి కాని యువతీయువకులు కలిసి జీవించే ( లివ్ ఇన్ రిలేషన్ ) నూ నిషేధిస్త చేసిన బిల్లును ఆమోదించేందుకు సిద్ధమైంది. దీంతో నిబంధనలు అతిక్రమించిన వారికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. వ్యభిచారాన్ని నేరంగా పరిగణించడంతో పాటు, పెళ్లి కాని జంటలు కలిసి జీవించడాన్ని నిషేధిస్తుంది. అయితే ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ముస్లిం దేశం కావడంతో ఇక్కడ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇలాంటి దేశాలు చాలా ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం. ( PC: Canva)
FIFA వరల్డ్ కప్ 2022కి ఆతిథ్యం ఇస్తున్న ఖతార్‌లో.. అవివాహిత వ్యక్తుల మధ్య శారీరక సంబంధాలు తప్పుగా పరిగణించబడతాయి. ఖతార్ అవివాహిత జంట చట్టాలు లేదా ఇస్లాం యొక్క జినా చట్టం ప్రకారం వివాహానికి ముందు సంబంధాలపై పూర్తి నిషేధాన్ని కలిగి ఉంది. రెడ్ నైజీరియా వెబ్సైట్ ప్రకారం, ఇక్కడ పట్టుబడిన వ్యక్తులు 1 సంవత్సరం వరకు జైలు శిక్షను అనుభవించవచ్చు. ముస్లిం నేరస్థులకు కొరడా దెబ్బలు, పెళ్లయిన ముస్లింలు రాళ్లతో కొట్టడం వంటి అదనపు శిక్షను విధించారు. ( PC: Canva)
ఖతార్ లాగా.. మరో అరబ్ దేశం.. సౌదీ అరేబియాలో కూడా పెళ్లికాని వ్యక్తులు శృంగారం చేయడాన్ని నిషేధించే జినా చట్టాలు ఉన్నాయి. ఇస్లాంలో జినా చట్టం అనేది ఇస్లామిక్ చట్టపరమైన పదం.. దీని అర్థం వివాహేతర వ్యక్తుల మధ్య వ్యభిచారం లేదా లైంగిక సంబంధం. సౌదీ అరేబియాలో శిక్షల ప్రక్రియలో కొంత వెసులుబాటు ఉంది. ఇక్కడ నేరం రుజువు చేయడానికి 4 మంది సాక్షులు అవసరం. అయితే, నేరం రుజువు అయితే.. కొరడా దెబ్బల శిక్ష విధిస్తారు. ( PC: Canva)
ఆఫ్ఘనిస్తాన్ ఒక ఇస్లామిక్ దేశం. దీంతో, ఇక్కడ పెళ్లికి ముందు శృంగారం, వివాహేతర సంబంధాలపై పూర్తిగా నిషేధం. కానీ తాలిబన్ల ఆధీనంలోకి వచ్చిన తర్వాత.. ఈ దేశంలో నియమాలు మరింత కఠినంగా మారాయి. అఫ్గాన్ శిక్షాస్మృతి ప్రకారం ఇద్దరు పెళ్లికాని వ్యక్తులు ఎఫైర్ పెట్టుకుంటే.. దారుణంగా శిక్షలు వేస్తారు తాలిబన్లు. ఆగస్టు 2010లో, ఆఫ్ఘనిస్తాన్లోని కుందుజ్ ప్రావిన్స్‌లో ఇలా ఎఫైర్ పెట్టుకున్న అవివాహిత జంటను రాళ్లతో కొట్టి చంపారు. ( PC: Canva)
పిరమిడ్లకు ప్రసిద్ధి చెందిన ఈజిప్టులో.. ఇస్లామిక్ చట్టం ప్రకారం.. వివాహితుల మధ్య ఎఫైర్ లేదా అవివాహిత వ్యక్తుల మధ్య సంబంధాలు నేరంగా పరిగణించబడతాయి. 2017లో.. దోహా సలా అనే టీవీ ప్రెజెంటర్..లైవ్ లో వివాహానికి ముందు ఎఫైర్ గురించి చర్చించినందుకే 3 సంవత్సరాల శిక్ష మరియు 43 వేల జరిమానా విధించబడింది. ( PC: Canva)