World’s Most Beautiful Metro Stations: మెట్రో సిటీలో నివసిస్తున్న లేదా ఇతర నగరాల్లో నివసిస్తున్న ప్రజలు తప్పనిసరిగా మెట్రోలో ప్రయాణించి ఉండాలి. మెట్రో స్టేషన్లు సృజనాత్మక కళ, సమర్థవంతమైన వాస్తుశిల్పులు మరియు ఇతర సాంస్కృతిక సంపదకు మంచి సాక్ష్యాలుగా పరిగణించబడతాయి. మెట్రో స్టేషన్లు నగరాలకు ప్రత్యేక ఆకర్షణ కూడా. ఇక, ఇక్కడ ప్రపంచలో అత్యంత అందమైన మెట్రో స్టేషన్లు గురించి తెలుసుకుందాం. (PC : Social Media)
Naples Metro, Italy: నేపుల్స్ మెట్రో (మెట్రోపాలిటానా డి నాపోలి) నిర్మాణం 1911లో ప్రారంభమైంది. రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో రెండు వైపులా లైన్లు మరియు ప్లాట్‌ఫారమ్‌లను నిర్మించారు. అయితే.. ఆధునిక కాలంలో ఇటాలియన్ మరియు అంతర్జాతీయ కళాకృతులు ప్రతిబింబించేలా ఈ స్టేషన్ కు మెరుగులు అద్దారు. 180 కంటే ఎక్కువ కళాకృతులు.. ఈ మెట్రో స్టేషన్ లోని ప్రతి లైన్ లోనూ మనం చూడవచ్చు. నేపుల్స్‌లోని అత్యంత ప్రసిద్ధ మరియు అందమైన మెట్రో స్టేషన్లలో ఒకటి టోలెడో. నవంబర్ 2012 నుంచి ఇది ప్రయాణికులకు అందుబాటులో ఉంది. ఐరోపాలో అత్యంత అందమైన స్టేషన్‌గా డైలీ టెలిగ్రాఫ్ ఓ కథనాన్ని వెలువరిచింది. దీని డిజైన్‌ను స్పానిష్ ఆర్కిటెక్చర్ సంస్థ వాటర్ అండ్ లైట్ థీమ్ తో రూపొందించింది. (PC : Social Media)
Moscow Metro Stations: మాస్కో మెట్రో 1935లో ప్రారంభించబడింది. ప్రస్తుతం 15 లైన్లు మరియు 200 కంటే ఎక్కువ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో దాదాపు సగంకు పైగానే అద్భుతంగా ఉంటాయి. పాలరాతి అంతస్తులు, లెనిన్ యొక్క అనేక విగ్రహాలు మరియు సోవియట్ సంస్కృతి ప్రతిబింబించేలా ఈ మెట్రో లైన్లను తీర్చిదిద్దారు. అలాగే.. మాస్కో మెట్రో లోపల ఫోటోలు కూడా తీసుకోవచ్చు. దీనికి ఎటువంటి పర్మిషన్ అవసరం లేదు. (PC : Social Media)
స్టాక్‌హోమ్ అండర్‌గ్రౌండ్ స్వీడన్ (Stockholm Underground Sweden): మీరు స్టాక్హోమ్ను సందర్శిస్తే.. అద్భుతమైన అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లను చూడటం మాత్రం మర్చిపోకండి. స్టాక్‌హోమ్ మెట్రో 100 భూగర్భ మెట్రో స్టేషన్లు కలిగి ఉంది. ఇందులో 90కి పైగా మెట్రో స్టేషన్లు రకరకాల కళాకృతులతో నిండి ఉంటాయి. 110-మైళ్ల ట్రాక్‌ను ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఆర్ట్ గ్యాలరీగా మార్చారు. రకరకాల చెట్లు, జంతువులు, ఎర్రటి ఆకాశం చూడాలంటే స్టాక్‌హోమ్ అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్లను సందర్శించాల్సిందే. (PC : Social Media)
Saint Petersburg Metro, Russia:ఎత్తైన పైకప్పులు, ప్రతిచోటా పాలరాయి, గ్రాండ్ డెకరేషన్ కారణంగా రష్యన్ సెయింట్ పీటర్స్ బర్గ్ భూగర్భ మెట్రో స్టేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. రష్యా వెళితే కచ్చితంగా సెయింట్ పీటర్స్బర్గ్ మెట్రో చూడాల్సిందే. సెయింట్ పీటర్స్బర్గ్ మెట్రోలో 72 స్టేషన్లు ఉన్నాయి. ఇందులో ఎనిమిది నుంచి తొమ్మిది స్టేషన్లు అద్భుతంగా ఉంటాయి. Avtovo, Navskaya, Admiralteyskaya మరియు Ploshad Vosstaniya మెట్రో స్టేషన్లు చూస్తే మరో లోకంలో ఉన్నం అనిపిస్తుంది. ఈ మెట్రో ఇప్పటికీ పాత-కాలపు టోకెన్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. మీరు స్టేషన్లలోని టిక్కెట్ కౌంటర్లతో పాటు వెండింగ్ మెషీన్ల నుండి కొనుగోలు చేయాలి. మీరు Podoroznik మెట్రో కార్డ్ అని పిలువబడే కాంటాక్ట్‌లెస్ కార్డ్‌తో కూడా చెల్లించవచ్చు. (PC : Social Media)
Lisbon Metro, Portugal: లిస్బన్ యొక్క మొత్తం మెట్రో వ్యవస్థ ప్రపంచంలోని అతి పెద్ద భూగర్భ ఆర్ట్ గ్యాలరీలలో ఒకటిగా ఉంది. 50 కంటే ఎక్కువ స్టేషన్లు ఉన్నాయి. ప్రతి స్టేషన్ కూడా అద్భుతమైన శైలిలో అలకరించబడి ఉంటాయి. పోర్చుగల్ వారసత్వం, చరిత్ర యొక్క కథల్ని లిస్బన్ మెట్రో తెలియజేస్తుంది. ఈ స్టేషన్లలో చాలా వరుకు కళాకృతుల కోసం పోర్చుగీస్ పలకల్ని ఉపయోగించారు. 1959లో మొదటి మెట్రో స్టేషన్లు ఇలా డిజైన్ చేయబడ్డాయి. కానీ ఇటీవల పెద్ద ఇన్స్టాలేషన్లు మరియు మిరుమిట్లుగొలిపే కళాఖండాలు కూడా జతచేశారు. (PC : Social Media)