Blackholes : ఇప్పటివరకూ రెండు బ్లాక్‌హోల్స్ ఢీకొట్టుకోవడాన్ని శాస్త్రవేత్తలు ఎప్పుడూ చూడలేదు. తొలిసారిగా అలాంటి సందర్భాన్ని పరిశీలిస్తున్నారు. ఆ రెండు కృష్ణబిలాలూ రోజురోజుకూ దగ్గరవుతున్నాయి. వాటి వేగం అనంతం. వాటి శక్తి అపారం. అందుకే శాస్త్రవేత్తలు దీనిపై ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. (image credit - Wikimedia Commons)
ఈ కృష్ణబిలాలు మన భూమికి 750 కాంతి సంవత్సరాల అవతల ఉన్నాయి. అవి రెండూ ఇప్పుడు కలవవు. అందుకు కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇదివరకు ఎప్పుడూ ఇంత దగ్గరగా వస్తున్న బ్లాక్‌హోల్స్‌ని మనుషులు చూడలేదని ఈ అధ్యయన రచయిత అయిన చియారా మింగారెల్లి ఆస్ట్రోఫిజికల్ జర్నల్‌లో రాశారు. (image credit - Wikimedia Commons)
రెండు బ్లాక్ హోల్స్ చుట్టూ ఉన్న గెలాక్సీలు ఢీకొట్టుకున్న తర్వాత... బ్లాక్ హోల్స్ కలిసిపోయి.. ఒకటే భారీ కొత్త గెలాక్సీ ఏర్పడగలదు. ఈ సమయంలో అత్యంత శక్తిమంతమైన ఆకర్షణ తరంగాలు (gravitational waves) రిలీజ్ అవుతాయి. అవి చాలా దూరం ప్రయాణిస్తాయి. చివరకు మరో అతిపెద్ద బ్లాక్‌హోల్ ఏర్పడుతుంది. ఇదంతా జరిగేందుకు కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని వల్ల భూమికి ఆపద వచ్చే అవకాశం లేదని తెలిపారు. (image credit - Wikimedia Commons)